భారత ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) తన కీర్తి కిరీటంలో మరో కలికితురాయిని చేర్చుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి అందుకుంటున్న పురస్కారాల(Awards) జాబితాలో తాజాగా బ్రెజిల్ అత్యున్నత పౌర పురస్కారం(Brazil’s highest civilian award) కూడా చేరింది. తన అధికారిక పర్యటనలో భాగంగా బ్రెజిల్‌లో ఉన్న ప్రధాని మోదీకి ఆ దేశ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా(Luiz Inacio Lula da Silva) మోదీకి ‘గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదరన్ క్రాస్(Grand Collar of the National Order of the Southern Cross)’ పురస్కారాన్ని ప్రదానం చేశారు.
Another accolade to his name! 🏅
President #Lula_bestowed #Brazil‘s #highest_civilian_honour, the ‘Grand Collar of the National Order of the Southern Cross,’ upon #PM @narendramodi ji. pic.twitter.com/ahPVXmoRXD
— Apparaju Janardhana Rao Sharma ji (@JanardhanaJi) July 9, 2025
మోదీకి 26వ అంతర్జాతీయ గౌరవం
కాగా ప్రధాని మోదీకి ఇది 26వ అంతర్జాతీయ గౌరవం కావడం విశేషం. అంతేకాకుండా జులై 2న ప్రారంభమైన తన ప్రస్తుత ఐదు దేశాల పర్యటనలో ఆయనకు లభించిన మూడో అత్యున్నత పురస్కారం కూడా ఇదే. అంతకుముందు బ్రెసీలియాలోని అల్వొరాడా ప్యాలెస్(Alvorada Palace)కు చేరుకున్న మోదీకి 114 గుర్రాలతో కూడిన సైనిక వందనంతో బ్రెజిల్ ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. ఈ పర్యటనలోనే గతవారం ట్రినిడాడ్ అండ్ టొబాగో(Trinidad and Tobago) తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో(The Order of the Republic of Trinidad and Tobago)’ను మోదీకి అందించింది. అంతకుముందు ఘనా(Ghana) దేశం కూడా తమ జాతీయ పురస్కారం ‘ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా(Officer of the Order of the Star of Ghana)’తో మోదీని సత్కరించింది.






