బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) ఎంత పెద్ద స్టార్‌హీరోగా వెలుగొందుతున్నాడో అందరికీ తెలిసిందే. ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆయన లైఫ్‌స్టైల్, వ్యక్తిత్వం, స్టైలిష్ లుక్స్, విలాసవంతమైన జీవనశైలితో సల్మాన్ ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటారు. ఖరీదైన డిజైనర్ దుస్తులు, విలాసవంతమైన గడియారాలు, అద్భుతమైన కార్ల కలెక్షన్… ఇలా అన్నింటిలోనూ ఆయనదే ప్రత్యేక స్థానం.
ఇక తాజాగా సల్మాన్ ఖాన్ తన గ్యారేజీలోకి మరో విలాసవంతమైన వాహనాన్ని చేర్చారు. అదే మెర్సిడెస్-మేబాచ్ GLS 600. ఈ GLS 600 SUV ధర సుమారు రూ. 3.39 కోట్లు కాగా, బుల్లెట్ ప్రూఫ్ వెర్షన్ అయితే దాని ధర రూ. 5 కోట్ల దాకా ఉండవచ్చని అంచన. గతంలో సల్మాన్ ఖాన్‌కు ప్రాణహాని బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో, ఈ కారును బుల్లెట్ ప్రూఫ్ మోడల్ కావచ్చని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. శక్తివంతమైన బాడీ, బోల్డ్ లుక్, ఆకర్షణీయమైన డిజైన్‌తో ఈ SUV సల్మాన్ కి సరిగ్గా సరిపోతుందని సినీ అభిమానులు చెబుతున్నారు.
సల్మాన్ ఖాన్ గ్యారేజీలో ఉన్న కార్ల జాబితా:
మెర్సిడెస్-మేబాచ్ GLS 600 (తాజాగా చేరిన కారు)
రేంజ్ రోవర్ SC LWB 3.0
టయోటా ల్యాండ్ క్రూయిజర్ LC200
మెర్సిడెస్-బెంజ్ GL
ఆడి RS7
బుల్లెట్ ప్రూఫ్ నిస్సాన్ పెట్రోల్
ఆడి A8L
ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్
మెర్సిడెస్-బెంజ్ AMG GLE కూపే






