ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్స్‌కు సంబంధించిన కేసులో ఈడీ (Enforcement Directorate) రంగంలోకి దిగింది. ఏకంగా 29 మంది సినీ ప్రముఖులు(Movie Celebrities), సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు(Social media influencers), కంపెనీలపై మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద కేసులు నమోదు చేసింది. ప్రముఖ నటులు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రానా దగ్గుబాటి(Rana Daggubati), ప్రకాశ్‌రాజ్(Prakashraj), మంచు లక్ష్మి(Manchu Laxmi), నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల వంటి వారి పేర్లు ఈ జాబితాలో ఉండటం టాలీవుడ్(Tollywood)లో కలకలం రేపుతోంది.
గతంలో FIR నమోదు చేసిన పోలీసులు
గతంలో సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన FIRను ఆధారంగా చేసుకుని ED ఈ దర్యాప్తును చేపట్టింది. ఈ సెలబ్రిటీలు భారీ మొత్తంలో పారితోషికాలు తీసుకుని, నిషేధిత బెట్టింగ్ యాప్(Banned betting apps)లను డౌన్‌లోడ్ చేసుకోవాలంటూ సోషల్ మీడియా(Social Media)లో విస్తృతంగా ప్రచారం చేశారన్నది ప్రధాన ఆరోపణ. వీరి ప్రచారం కారణంగా ఎంతోమంది యువత ఈ యాప్‌ల బారిన పడి, ఆర్థికంగా చితికిపోయి ఆత్మహత్యలకు పాల్పడ్డారని పోలీసులు FIRలో పేర్కొన్నారు.

తెలంగాణ గేమింగ్ చట్టం, ఐటీ చట్టం కింద
ఈ కేసులో యాంకర్లు శ్రీముఖి(Srimukhi), వర్షిణి సౌందరరాజన్, సిరి హనుమంతుతో పాటు పలువురు బుల్లితెర నటులు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల పేర్లను కూడా చేర్చారు. తెలంగాణ గేమింగ్ చట్టం(Telangana Gaming Act), ఐటీ చట్టం(IT Act)లోని వివిధ సెక్షన్ల కింద హైదరాబాద్ పోలీసులు(Hyderabad Police) కేసు నమోదు చేయగా, ఇప్పుడు ED దర్యాప్తుతో ఈ కేసు మరింత తీవ్రరూపం దాల్చింది. త్వరలోనే వీరందరినీ విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది.
బెట్టింగ్ యాప్స్ కేసులో మరో మారు సంచలనం – 29 మంది సినీ ప్రముఖులపై ఈడీ కేసులు
విజయ్ దేవరకొండ, రానా, శ్రీముఖి తదితరులపై ఈడీ విచారణకు సిద్ధం
మనీ లాండరింగ్ చట్టం కింద కేసులు నమోదు..
సైబరాబాద్ ఎఫ్ఐఆర్ ఆధారంగా బెట్టింగ్ ప్రమోషన్లపై ఈడీ దర్యాప్తు వేగవంతం.. #BettingApps #ED pic.twitter.com/Kj4rl3SWWh
— Devika Journalist (@DevikaRani81) July 10, 2025






