
కలర్ ఫొటో (Color Photo), బేబీ మూవీలు యువతను ఎంతగానో ఆకట్టుకున్నాయి. చిన్న సినిమాలుగా రిలీజ్ అయి బ్లాక్ బ్లస్టర్ మూవీలుగా నిలిచాయి. కంటెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ఈ రెండు చిత్రాలు నిరూపించాయి. ముఖ్యంగా బేబీ మూవీ ప్రస్తుత తరంలో ఉన్న యువతను చూపిస్తూ గుణపాఠం చెప్పేలా ఉంటుంది. ఇలాంటి చిత్రాలతో కంటెంట్ నే నమ్ముకుని సినిమా తీసేందుకు నిర్మాతలు ముందుకొస్తారు. ఈ రెండు చిత్రాలను నిర్మించిన సంస్థ మరోసారి ఎంటర్ టైన్ చేసేందుకు సిద్ధమైంది.
జూన్ 2న ఫస్ట్ గ్లిమ్స్
తాజాగా ఓ పోస్టర్ (poster release) ను ఈ రెండు చిత్రాల నిర్మాణ సంస్థ రిలీజ్ చేసింది. జూన్ 2న టైటిల్, గ్లిమ్స్ ను రిలీజ్ చేస్తున్నట్లు అప్ డేట్ ఇచ్చారు. జూన్ 2 సాయంత్రం అయిదు గంటల నాలుగు నిమిషాలకు టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు ఫస్ట్ గ్లిమ్స్ ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. దీనికి నిర్మాతగా ఎస్ కే ఎన్ ఉన్నారు. సాయి రాజేశ్, మణిశర్మ కూడా ఈ మూవీకి వర్క్ చేస్తున్నారు.
కథే ప్రధానంగా..
ప్రస్తుతం యువతకు వీరు తీసిన రెండు సినిమాలు ఎంతో నచ్చాయి. అదే హోప్ తో మరో సారి ముందుకు సాగాలని అనుకుంటున్నారు. బేబీ (baby)లో ఓ యువతి లేని పోని కోరికలకు పోయి లైఫ్ ను ఎలా నాశనం చేసుకుందో చూపించారు. కలర్ ఫొటోలో ఉన్నతంగా ఉన్న అమ్మాయిని ప్రేమించి ఎలా మోసపోతాడో చూపించారు. రెండు కథలు వేరు, చూపించిన విధానం మాత్రం యూత్ ను ఎంతో ఆకట్టుకుంది. అందుకే రెండు చిన్న సినిమాలుగా విడుదలై సూపర్ డూపర్ హిట్ లుగా నిలిచాయి. ఇక వీరి నిర్మాణంలోనే రాబోతున్న ఈ మూవీ కూడా కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందనే ఆశిస్తున్నారు.