టాలీవుడ్ (tollywood)లో సూపర్‌స్టార్ కృష్ణ (super star krishna) కుటుంబం నుంచి మరో వారసుడు సినీ రంగ ప్రవేశం చేయనున్నాడు. దివంగత నటుడు కృష్ణ పెద్ద కుమారుడు, దివంగత రమేశ్ బాబు (Ramesh babu) తనయుడు జయకృష్ణ (jaya krishna)త్వరలోనే హీరోగా పరిచయం కానున్నాడు. ఇందుకోసం ఇప్పటికే విదేశాల్లో నటనలో శిక్షణ తీసుకున్న జయకృష్ణ, ప్రస్తుతం పలు కథలు వింటున్నట్లు సమాచారం. సూపర్‌స్టార్ మహేశ్ బాబు (mahesh babu) మేనల్లుడు కావడంతో జయకృష్ణ ఎంట్రీపై తెలుగు చలన చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Director Ajay Bhupathi to launch Ghattamaneni Jaya Krishna (son of Ghattamaneni Ramesh Babu) in Telugu cinema.
Vyjayanthi Movies and Anandhi Arts will jointly produce the project.
An official announcement is expected soon. pic.twitter.com/lYBxMBUzxP
— Milagro Movies (@MilagroMovies) May 19, 2025
RX100 దర్శకుడితో ఎంట్రీ
ఇన్నాళ్లు కథలు విన్న జయకృష్ణ ఓ స్టోరీని ఫైనల్ చేసినట్లు సమాచారం. తన డెబ్యూ మూవీని ఆర్ ఎక్స్-100 (RX100 Film) మూవీ దర్శకుడు అజయ్ భూపతి (Ajay bhoopathi) తెరకెక్కించనుండగా.. వైజయంతీ మూవీస్, ఆనంది ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, ఇప్పటికే జయకృష్ణ కటౌట్(cutouts viral) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మహేశ్‌తో పాటే అతని సోదరులు, సోదరి..
సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి సినీ పరిశ్రమలోకి చాలా మంది అడుగుపెట్టారు. కృష్ణ తన నట ప్రస్థానంలో సరికొత్త చరిత్ర సృష్టించగా, ఆయన తర్వాత కుమారుడు మహేశ్ బాబు సూపర్‌స్టార్‌గా ఒక వెలుగు వెలుగుతున్నారు. పెద్ద కుమారుడు రమేశ్ బాబు కొన్ని సినిమాల్లో హీరోగా చేసి ఆ తర్వాత నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. కృష్ణ కూతురు మంజుల నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా తనదైన ముద్ర వేసుకున్నారు.
విజయ నిర్మల మనవడు సైతం..
వారితో పాటే కృష్ణ మరో కొడుకు గల్లా అశోక్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చి సినిమాలు చేస్తున్నారు. విజయనిర్మల మనవడు, నరేష్ కుమారుడు శరణ్ కుమార్ కూడా సినీ రంగంలో కొనసాగుతున్నారు. వీరందరిలో కేవలం మహేశ్ బాబు మాత్రమే అత్యంత విజయవంతమైన నటుడిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు జయకృష్ణ కూడా ఈ పరంపరను కొనసాగించడానికి సిద్ధమవుతున్నాడు. బాబాయ్ మహేష్ బాబు వలె సినిమా పరిశ్రమలో తన ముద్ర వేయడానికి సిద్ధమయ్యాడు.






