షాక్‌లో అనూ ఇమ్మాన్యుయేల్.. ఆ డెడ్‌బాడీస్ ఎవరివి?

అమెరికా బ్యూటీ అనూ ఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel) తెలుగు వారికి సుపరిచతమే. ఈ భామ తాజాగా సినిమాటోగ్రాఫర్ ఆండ్రీవ్ బాబు దర్శకత్వంలో వస్తున్న ఓ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీకి ‘బూమరాంగ్ (Boomerang)’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సందర్భంగా మేకర్స్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చాలా ఆసక్తికరంగా కనిపించింది. ఈ మూవీలో శివ కందుకూరి ఫీమేల్ లీడ్ గా నటిస్తున్నాడు.

షాక్ లో అను

ఇక తాజాగా మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ లో చీకట్లో ఉన్న ఓ ఇంటి ముందు డెడ్‌బాడీలు పడి కనిపిస్తున్నాయి. వాటి మధ్యలో నుంచి ఓ వ్యక్తి కుక్కను పట్టుకుని రావడం కనిపిస్తోంది. ఇక మరోవైపు అనూ ఇమ్మాన్యుయేల్ ఈ పోస్టరులో చాలా షాక్ కు గురైనట్లుగా కనిపించడం చూడొచ్చు. ఈసారి ఈ బ్యూటీ ఏదో సస్పెన్స్ స్టోరీతో పక్కా హిట్ కొట్టేందుకు వచ్చేస్తోందని నెటిజన్లు అంటున్నారు. ఈ సినిమాతో ఆండ్రీవ్‌ బాబు దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు.

కర్మ ఈజ్ ఏ బూమరాంగ్

యూనిక్‌ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ మూవీలో శివ కందుకూరి (Shiva Kandukuri), అనూ ఇమ్మాన్యుయేల్ తో పాటు.. వెన్నెల కిశోర్‌, వైవా హర్ష ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని బిగ్ మూవీ మేకర్స్‌ లిమిటెడ్‌, మై3 ఆర్ట్స్‌ బ్యానర్లపై లండన్‌ గణేశ్, డాక్టర్‌ ప్రవీణ్ రెడ్డి ఊట్ల నిర్మిస్తోంది. రెండు స్టోరీ లైన్స్‌ ఆధారంగా కర్మ థీమ్‌తో సమాంతరంగా థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌తో సినిమా ఉండబోతున్నట్టు మేకర్స్‌ ప్రకటించారు. లండన్‌లోని అందమైన లొకేషన్లలో ఈ సినిమా స్టోరీ సాగుతుందని చెప్పారు.

ఈ సినిమా కలిసొచ్చేనా

ఇక అనూ ఇమ్మాన్యుయేల్ నాని నటించిన ‘మజ్ను (Majnu)’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత గోపీచంద్‌, అల్లు అర్జున్, పవన్‌ కల్యాణ్, రవితేజ లాంటి స్టార్‌ హీరోలతో సినిమాలు చేసింది. ఈ బ్యూటీ రవితేజతో కలిసి నటించిన రావణాసుర, కార్తీతో నటించిన జపాన్‌ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఇప్పుడు ఆశలన్నీ బూమరాంగ్ పైనే పెట్టుకుంది. మరి ఈ సినిమా హిట్ అవుతుందో లేదో తెలియాలంటే రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *