అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) లీడ్ రోల్లో వస్తున్న మూవీ ‘పరదా’ (Paradha). ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల డైరెక్ట్ చేస్తున్నారు. ఆనంద మీడియా బ్యానర్‌పై విజయ్ డొంకాడ, పీవీ శ్రీనివాసులు, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు. భిన్నమైన కథాంశంతో మూవీ రూపొందుతోంది. ఈ నెల 22న మూవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో మంగళవారం ‘ఎగరేయి నీ రెక్కలే.. కలిపే ఈ ఆ దిక్కులే’ అనే లిరికల్ వీడియోను మూవీ టీమ్ రిలీజ్ చేసింది. సీనియర్ లిరిసిస్ట్ వనమాలి పాట రాయగా.. రితేశ్ జి రావ్ ఆలపించారు.
దర్శన, సంగీత, రాగ్ మయూర్ కీలక పాత్రల్లో..
గోపీ సుందర్ (Gopi Sundar) మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే థీమ్ సాంగ్ రిలీజ్ అయ్యింది. ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా..’ అనే పాటను కొద్దిరోజుల క్రితం రిలీజ్ చేశారు. అనురాగ్ కులకర్ణి (anurag kulkarni) పాడిన పాట ఇప్పటికే ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో ‘హృదయం’ మూవీ ఫేమ్ దర్శన (darshana rajendran), సీనియర్ నటి సంగీత(Sangeetha)తోపాటు రాగ్ మయూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.






