టీమ్ఇండియా(Team India) స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ(Virat Kohli), బాలీవుడ్ నటి అనుష్క శర్మ(Anushka Sharma) దంపతులు కొత్త ఇంట్లోకి మారనున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా(SM)లో విరుష్క జోడీ(Virushka Jodi) కొత్త హౌస్(New House)కు సంబంధించి వీడియోలు, ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. మహారాష్ట్రలోని ముంబైకి సమీపంలోని అలీబాగ్(Alibaug)లో కోహ్లీ దంపతులు నూతన ఇంటిని నిర్మించుకున్నారు. ప్రస్తుతం దాని నిర్మాణ పనులు పూర్తయ్యాయి. గృహప్రవేశం కోసం ఆ ఇంటిని పూలు, లైట్లతో అందంగా అలంకరిస్తున్న వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే విరుష్క జోడీ ముంబై నుంచి గృహ ప్రవేశం కోసం అలీబాగ్‌కు వెళ్లారు.
#AnushkaSharma and #ViratKohli’s Alibaug residence is being decorated. The couple will reportedly host a housewarming ceremony soon. 🫶🏽#FilmfareLens pic.twitter.com/YW66Ok8Em6
— Filmfare (@filmfare) January 15, 2025
అత్యాధునిక హంగులతో ఇంటి నిర్మాణం
కాగా, విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల అలీబాగ్ ఇంటికి రూ.32 కోట్లు ఖర్చయినట్లు సమాచారం. వీరిద్దరూ 2022లో అలీబాగ్‌లో రూ.19 కోట్లు వెచ్చించి ఇంటి స్థలం కొనుగోలు చేశారు. ఇంటి నిర్మాణాని(House Construction)కి మరో రూ.13 కోట్లు వెచ్చించారు. 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సువిశాలమైన విల్లా, స్విమ్మింగ్ పూల్(Swimming pool) సహా గార్డెన్ ఏర్పాటు చేయించుకుంది విరుష్క జంట. ఈ విల్లాలో ఉష్ణోగ్రత నియంత్రిత స్విమ్మింగ్ పూల్, బెస్పోక్ కిచెన్,4 బాత్‌రూమ్‌లు, జాకుజీ, విశాలమైన గార్డెన్, కవర్ పార్కింగ్, స్టాఫ్ క్వార్టర్స్ ఇలా ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. ఈ ఇంటిని ఫిలిప్ ఫౌచే నేతృత్వంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆర్కిటెక్ట్‌లు డిజైన్ చేశారు. ఇది కాలిఫోర్నియా కొంకణ్ తరహా నాలుగు పడక గదుల విల్లా. కాగా ప్రస్తుతం విరాట్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy), ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్(ODI series against England) కోసం ప్రిపేర్ అవుతున్నాడు.







