Ghaati Trailer: స్వీటీ ఫ్యాన్స్‌కు ట్రీట్.. నేడే ‘ఘాటి’ మూవీ ట్రైలర్ రిలీజ్

టాలీవుడ్‌లో మరో సంచలన చిత్రం ‘ఘాటి(Ghaati)’ ట్రైలర్ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ చిత్రం టీజర్, పోస్టర్‌లు ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తించాయి. ఈ మేరకు ‘ఘాటి’ ట్రైలర్(Ghaati Trailer) రిలీజ్ డేట్‌ను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈరోజు (ఆగస్టు 6) సాయంత్రం 4.35 గంటలకు ట్రైలర్‌ను గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని నిర్మాతలతోపాటు అనుష్క శెట్టి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీంతో అభిమానులు ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి లీడ్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు క్రిష్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ పూర్తి క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రంగా తెరకెక్కుతోంది.

కంప్యూటర్ గ్రాఫిక్స్ పనులు పూర్తి కాకపోవడంతో

కాగా ఈ చిత్రాన్ని మొదట ఏప్రిల్ 18న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేశారు. అప్పటికే సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. కానీ, ఊహించని విధంగా షూటింగ్ ఆలస్యం కావడంతో, ఆ తేదికి సినిమా విడుదల సాధ్యం కాలేదు. దీంతో, అభిమానులు కొంత నిరాశకు గురయ్యారు. ఆ తర్వాత మేకర్స్ సినిమాను జులై 11న విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే షూటింగ్ కూడా పూర్తి చేశారు. కానీ, సినిమాకు సంబంధించిన కంప్యూటర్ గ్రాఫిక్స్ పనులు పూర్తి కాకపోవడంతో మళ్లీ పోస్ట్ పోన్ అయింది.

నాణ్యత విషయంలో రాజీ పడకుండా

భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘ఘాటీ’కి (Ghati Movie) గ్రాఫిక్స్ వర్క్ (Graphics work for ‘Ghaati’) చాలా కీలకం. నాణ్యత విషయంలో రాజీ పడకుండా, అద్భుతమైన విజువల్స్ అందించాలనే ఉద్దేశంతోనే ఈ ఆలస్యం జరుగుతున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతానికి, నిర్మాతలు సినిమాకు కొత్త విడుదల తేదీని పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాగా ‘ఘాటి’ సినిమా తెలుగు, తమిళ, హిందీ, మలయాళంతో సహా పలు భాషల్లో పాస్ ఇండియా(Pan-India) స్థాయిలో రిలీజ్ కానుంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *