టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి(Anushka Shetty) నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఘాటి’ ట్రైలర్(Ghaati trailer) విడుదలైంది. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) రూపొందించిన ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌లో అనుష్కతో పాటు విక్రమ్ ప్రభు, జగపతి బాబు, చైతన్య రావు కీలక పాత్రలు పోషిస్తున్నారు. UV క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
గంజాయి మాఫియా నేపథ్యంలో..
ట్రైలర్ ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో గంజాయి మాఫియా నేపథ్యంలో సాగుతుంది. “ఘాట్లలో గాటీలు ఉంటారు సార్” అనే శక్తిమంతమైన డైలాగ్‌తో మొదలై, అనుష్క రౌద్రరూపంలో అదరగొట్టింది. “సీతమ్మోరు లంకా దహనం చేస్తే ఎట్టుంటదో చూద్దురు గానీ” అనే డైలాగ్ సినిమాపై అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లింది. అనుష్క బస్ కండక్టర్‌గా, విక్రమ్ ప్రభు డిస్పెన్సరీ ఉద్యోగిగా కనిపిస్తూ, స్మగ్లర్ల అన్యాయానికి వ్యతిరేకంగా తిరగబడే ప్రేమ జంటగా నటించారు.

నాగవెల్లి విద్యాసాగర్(Nagavelli Vidyasagar) అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ఉద్వేగభరిత సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్స్‌లు ట్రైలర్(Trailer)కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనుష్క అభిమానులు ఈ ట్రైలర్‌తో ఉత్సాహంగా ఉన్నారు, ఆమె ‘అరుంధతి(Arundhathi)’ తరహాలో మరో శక్తిమంతమైన పాత్రలో కనిపించనుందని ఆశిస్తున్నారు. సినిమా పాన్ ఇండియా(Pan-india) స్థాయిలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇంకెందుకు ఆలస్యం మీరూ ట్రైలర్ చూసేయండి..






