AP – పైరవీలతో కాదు.. ప్రజల్లో ఉంటేనే టికెట్‌.. మొహమాటం లేకుండా చెప్పేస్తున్న అధిష్ఠానం

ఏపీలో కూడా ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. గడిచిన నాలుగేళ్లు ఒక లెక్క.. ఈ ఎనిమిది నెలలు మరో లెక్క. అందుకే అన్ని పార్టీల అధినేతలు బుర్రలకు పదును పెడుతున్నారు. రానున్న ఎన్నికలలో మళ్లీ గెలవాలంటే ఏం చేయాలి? ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? తమ పార్టీకి నష్టం తెచ్చిపెట్టే ఎమ్మెల్యేలు ఎవరనే దానిపై ఫోకస్ మొదలు పెట్టారు. అయితే ఎన్నికల్లో టికెట్లు ఎవరికివ్వాలనే అంశంపై వైసీపీ అధిష్ఠానం స్పష్టమైన విధానాన్ని ఎంచుకుంది. ప్రజాబలం ఉన్న నేతలకే.

మొహమాటం లేదు…. ఫీల్ అవుతారన్న ఫీలింగూ లేదు.. గెలిచే అవకాశం ఉంటేనే ఛాన్స్‌. లేదంటే అంతే సంగతులు. ఏపీలో ఎన్నికల హడావిడి మొదలవుతున్న వేళ వైసీపీ అధిష్ఠానం ఆ పార్టీ నేతలకు తేల్చిచెప్పిన మాటలివి. అధిష్టానం చుట్టూ తిరిగితే ఉపయోగంలేదు.. గల్లీగల్లీకి వెళ్లాల్సిందే. పైరవీలతో కాదు.. ప్రజల్లో ఉంటేనే టికెట్‌ అంటూ టికెట్ల కేటాయింపు విషయంలో స్పష్టమైన వైఖరితో ముందుకు సాగుతోంది ఫ్యాన్‌ పార్టీ.

ఏపీలో కూడా ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. గడిచిన నాలుగేళ్లు ఒక లెక్క.. ఈ ఎనిమిది నెలలు మరో లెక్క. అందుకే అన్ని పార్టీల అధినేతలు బుర్రలకు పదును పెడుతున్నారు. రానున్న ఎన్నికలలో మళ్లీ గెలవాలంటే ఏం చేయాలి? ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? తమ పార్టీకి నష్టం తెచ్చిపెట్టే ఎమ్మెల్యేలు ఎవరనే దానిపై దృష్టి పెట్టారు. అయితే ఎన్నికల్లో టికెట్లు ఎవరికివ్వాలనే అంశంపై వైసీపీ అధిష్ఠానం స్పష్టమైన విధానాన్ని ఎంచుకుంది. ప్రజాబలం ఉన్న నేతలకే అవకాశాలు ఇవ్వాలని ఈ విషయంలో మరో అభిప్రాయానికి తావివ్వకూడదని స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది.

అటు చంద్రబాబు, ఇటు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ దూకుడు పెంచడంతో తమ పార్టీ ఎమ్మెల్యేల పనితీరును వైసీపీ అధిష్ఠానం సీరియస్‌గా గమనిస్తోంది. ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తోంది. ఎవరికైనా మార్కులు, గ్రేడ్లు తగ్గితే మాత్రం.. అస్సలు ఊరుకునేది లేదని హైకమాండ్ హెచ్చరికలు ఇస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యేల పనితీరు, నియోజకవర్గాలలో పరిస్థితిపై సర్వేలు తెప్పించుకున్న సీఎం జగన్… గతంలో ఎమ్మెల్యేలకు క్లాసులు కూడా పీకారు.

పర్ఫామెన్స్ వీక్ ఉన్న వారందరికీ ఇప్పటికే ఒకసారి తాడేపల్లి ప్యాలెస్‌లో వర్క్ షాప్ నిర్వహించి మరీ చక్కదిద్దుకోవాలని హెచ్చరించారు. ఇకనైనా పని తీరు మార్చుకోకపోతే టికెట్లు ఇవ్వడం కష్టమేననని కూడా అప్పుడే తేల్చేశారు. అయితే వారిలో ఎందరిలో మార్పు వచ్చిందో.. ఎందరిలో మార్పు రాలేదో తెలియదు కానీ.. పని గ్రాఫ్‌ పడిపోయిన ఎమ్మెల్యేలకు మాత్రం వచ్చే ఎన్నికలలో టికెట్ దక్కే అవకాశాలు ఇసుమంతైనా లేవని తేటతెల్లమైపోయినట్లు తాడేపల్లి ప్యాలెస్ వర్గాల నుంచే గట్టిగా వినిపిస్తోంది.

Share post:

లేటెస్ట్