ఏపీ సీఎం చంద్రబాబు(AP CM Chandrababu) వెలగపూడి(Velagapudi)లో సొంత ఇల్లు కట్టుకోనున్నారు. ప్రస్తుతం ఆయన కృష్ణా నది ఒడ్డున(On the banks of Krishna river) ఉండవల్లిలో లింగమనేనికి చెందిన అతిథి గృహంలో గత పదేళ్లుగా ఉంటుండగా.. అక్కడి నుంచి రాజధాని ప్రాంతాని(Amaravati)కి మారబోతున్నారు. సువిశాల స్థలాన్ని ఇటీవల కొనుగోలు చేశారు. భవిష్యత్తు కుటుంబ అవసరాలు, తన హోదా, వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ స్థలం వైపు చంద్రబాబు మొగ్గు చూపారు. రోడ్డుకు ఆనుకుని ఉన్న 5 ఎకరా(Five Acres)ల్లో కొత్త ఇల్లు నిర్మాణానికి అనుకూలంగా ఉంటుందని ఆయన నిర్ణయించారు.
అన్ని అవసరాలకు తగ్గుట్టుగా..
దీనికి నాలుగు వైపులా రోడ్డు ఉండడం, ప్రధానంగా రాజధాని(Capital city)లో కీలకమైన సీడ్ యాక్సెస్(Seed access) దీని పక్క నుంచి వెళ్తుండడంతో ఎంపిక చేశారు. సమీపంలో GO, NGO నివాస సముదాయాలు, న్యాయమూర్తుల బంగ్లాలు, విట్ విశ్వవిద్యాలయం, తాత్కాలిక హైకోర్టు, అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ కు కేవలం 2KM దూరంలోనే ఉండడంతో పాటు రవాణా(Transport) పరంగానూ అనుకూలతులు ఉన్నట్లు భావించి కొనుగోలు చేశారు. ఇందులోనే ఇల్లు, ఉద్యానవనం, రక్షణ సిబ్బందికి గదులు, వాహనాల పార్కింగ్(Parking), తదితర అవసరాల కోసం వినియోగించనున్నారు. సాధ్యమైనంత త్వరగా ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేయనున్నట్లు సమాచారం.
రాజధానిలో సొంత ఇల్లు లేదని YCP విమర్శ
ఇదిలా ఉండగా ప్రతిపక్ష YCP నాయకులు తరచుగా CMపై చేస్తున్న విమర్శలకు ఇప్పుడు ఆయన చెక్ పెట్టేందుకు చంద్రబాబు రెడీ అయ్యారు. రాజధానిలో చంద్రబాబుకు సొంత ఇల్లు లేదని.. ఆయన రాజధానిని కడతానని చెబుతు న్నారంటూ YCP నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీనికి కారణం.. ప్రస్తుతం ఉండవల్లిలోని లింగమనేని ఎస్టేట్స్(Lingamaneni Estates, Undavalli)కు చెందిన ఇంట్లో చంద్రబాబు అద్దెకు ఉంటున్నారు. ఈ కారణంగానే చంద్రబాబుపై అనేక విమర్శలు వచ్చాయి. అయితే.. ఇప్పుడు చంద్రబాబు అదే రాజధానిలోని వెలగపూడిలో శాస్వత నివాసం ఏర్పాటు చేసుకుంటానని చెప్పడంతో వైసీపీ విమర్శలకు కౌంటర్ ఇచ్చినట్లైంది.