దుర్యోధనుడిగా డిప్యూటీ స్పీకర్.. ‘రఘురామా.. మీ టాలెంట్ సూపర్’

ఏపీ(AP)లోని విజయవాడ A1 కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన MLA, MLCల సాంస్కృతిక కార్యక్రమా(cultural events)ల్లో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు(Deputy Speaker Raghuramakrishna Raju) దుర్యోధన ఏకపాత్రాభినయం(Duryodhana monologue) చేసి అందరిని అలరించారు. ‘‘ఆచార్య దేవా… ఏమంటివి, ఏమంటివి’’ అంటూ సుదీర్ఘమైన డైలాగులను తనదైన శైలిలో పలికి రంజింపజేశారు. ఆయన నటనకు కేరింతలతో ప్రాంగణమంతా మార్మోగింది. దీంతో స్టేజీపై రఘురామ ప్రదర్శనను సీఎం చంద్రబాబు (CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan), స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రి నారా లోకేశ్, ఇతర సభ్యులు ఎంతో ఆస్వాదించారు. ప్రదర్శన అయిపోయాక లేచి నిలబడి మరీ చప్పట్లు కొట్టి ఆయనను అభినందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాతో తెగ వైరల్ అవుతోంది. ‘రఘురామా.. మీ టాలెంట్ సూపర్’ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

బాలచంద్రుడి వేష ధారణలో మంత్రి కందుల

అనంతరం పల్నాటి బాలచంద్రుడి(Palnadu Balachandra) వేష ధారణలో మంత్రి కందుల దుర్గేష్(Minister Kandula Durgesh) అదరగొట్టారు. వేషధారణ, అద్భుతమైన డైలాగ్‌లతో అందరినీ ఆకర్షించారు. దుర్గేష్ ప్రదర్శనకు సభ్యుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. కాగా ఈ నెల 18, 19, 20 తేదీల్లో విజయవాడ(Vijayawada)లోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్టేడియం, ఇండోర్‌ స్టేడియాల్లో ఏపీ శాసన సభ్యులు, మండలి సభ్యులకు సాంస్కృతిక, ఆటపోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో సభ్యులందరూ పాల్గొని తమ ప్రతిభ కనబర్చారు. గురువారంతో ఈ కార్యక్రమాలు ముగిశాయి.

Related Posts

Nara Lokesh: ‘వ్యూహం’ విడుద‌ల వ‌ద్దు.. సెన్సార్‌ బోర్డుకు లోకేష్‌ లేఖ

వ్యూహం చిత్రాన్ని నవంబర్‌ 10వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఇప్ప‌టికే ప్రకటించింది. అయితే తాజాగా ఈ సినిమా విడుదలను అడ్డుకోవాలని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేషన్‌ కోరారు. ఇందులో భాగంగానే సినిమా విడుదలకు అనుమతి ఇవ్వకూడదని కోరుతూ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *