విద్యార్థులకు గుడ్ న్యూస్.. పది రోజులు సంక్రాంతి సెలవులు

ఏపీలో విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. సంక్రాంతి సెలవుల (School Holidays)పై తాజాగా క్లారిటీ ఇచ్చింది. మూడు కాదు నాలుగు కాదు వారం కాదు ఏకంగా పది రోజుల పాటు సెలవులు ప్రకటించింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ముందుగా చెప్పినట్లుగానే సెలవులు ఇస్తున్నట్లు తెలిపింది. జనవరి 10వ తేదీ (శుక్రవారం) నుంచి సంక్రాంతి పండుగ సెలవులు (AP Sankranti Holidays) ప్రారంభం కానున్నాయి. 19వ తేదీన సెలవులు ముగియనుండగా.. జనవరి 20వ తేదీ నుంచి మళ్లీ పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.

10 రోజుల పాటు సెలవులు

అంటే మొత్తం పది రోజుల పాటు విద్యార్థులకు సంక్రాంతి పండుగే అన్నమాట ఇక. చాలా రోజులు సెలవులు వస్తుండటంతో విద్యార్థులు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ పది రోజుల హాలిడేస్ (AP Holidays 2025) లో ఏమేం ఆటలు ఆడుకోవాలి.. అమ్మమ్మ ఇంటికి వెళ్లాలా.. ఇంకా ఎక్కడికైనా వెళ్లాలా.. అసలు ఈ సెలవు రోజులను ఎలా స్పెండ్ చేయాలో ఇప్పుడే తమ తల్లిదండ్రులతో కలిసి ప్లాన్ చేసుకుంటున్నారు. ఏది ఏమైనా పండుగ మూడ్రోజులు మాత్రం కుటుంబంతో కలిసి స్పెండ్ చేసేలా చూసుకుంటున్నారు.  మరోవైపు క్రిస్టియన్ పాఠశాలలకు మాత్రం జనవరి 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సెలవులు ప్రకటించినట్లు ఏపీ విద్యాశాఖ వెల్లడించింది.

సంక్రాంతి సందడి షురూ

ఇక సంక్రాంతి పండుగ అనగానే ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు (Sankranti Rangoli), బోగీ మంటలు, హరిదాసు కీర్తనలు, గాలి పటాలు ఎగురవేయడాలు.. ఈ పండుగ సందడి అంతా ఇంతా కాదు. ఆడపిల్లలంతా పండుగ రోజుల్లో ఎలాంటి రంగవళ్లులు తీర్చిదిద్దాలో ప్లాన్ చేసుకుంటుంటే.. అబ్బాయిలు మాత్రం గాలిపటాలు ఎగుర వేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే చాలా ఊళ్లలో పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత గాలి పటాలు (Kites Flying) ఎగురవేడయంలో బిజీ అవుతున్నారు. అయితే గాలి పటాలు ఎగురవేసేటప్పుడు చైనా మాంజాను వినియోగించవద్దని ఇప్పటికే అధికారులు సూచించిన విషయం తెలిసిందే.

Related Posts

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మరో వారం రోజులూ జోరు వర్షాలు: IMD

తెలుగు రాష్ట్రాలను వర్షాలు(Rains) బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని నదులు, చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ(Department of Meteorology) మరో పిడుగులాంటి వార్త చెప్పింది. ఛత్తీస్‌గఢ్‌ పరిసర…

APL-2025: తుంగభద్ర వారియర్స్‌దే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టైటిల్

ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL -2025) విజేతగా తుంగభద్ర వారియర్స్(Tungabhadra Warriors) నిలిచింది. విశాఖపట్నంలోని డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ACA-VDCA ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఫైనల్(Final) మ్యాచ్‌లో తుంగభద్ర వారియర్స్ అమరావతి రాయల్స్‌(Amaravati Royals)ను 5 వికెట్ల తేడాతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *