AP Mega DSC-2025: గెట్ రెడీ.. నేడు మెగా డీఎస్సీ మెరిట్ లిస్ట్ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ(AP Mega DSC-2025) రాసిన వేలాది మంది అభ్యర్థుల నిరీక్షణకు తెరపడనుంది. అత్యంత ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మెరిట్ జాబితా(Merit List)ను ఈరోజు (ఆగస్టు 22) విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ(School Education Department) ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఇప్పటికే టెట్ మార్కుల సవరణ(TET Marks Correction), స్పోర్ట్స్ కోటా మెరిట్ జాబితా(Sports Quota Merit List) రూపకల్పన వంటి ప్రక్రియలు పూర్తయిన నేపథ్యంలో, తుది మెరిట్ జాబితా(Final Merit List)ను విడుదల చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు మెగా డీఎస్సీ-2025 కన్వీనర్ ఎం.వి.కృష్ణారెడ్డి(Convener M.V. Krishna Reddy) ఈ వివరాలను వెల్లడించారు.

కాల్ లెటర్ అందుకున్న వారికే వెరిఫికేషన్

మెరిట్ జాబితాను DSC అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, ఆయా జిల్లాల విద్యాశాఖాధికారుల (DEO) వెబ్‌సైట్లలో కూడా అందుబాటులో ఉంచుతామని తెలిపారు. అభ్యర్థులు కేవలం ఈ అధికారిక వెబ్‌సైట్ల ద్వారా మాత్రమే సమాచారాన్ని పొందాలని ఆయన సూచించారు. వివిధ కేటగిరీల కింద పోస్టులకు ఎంపికయ్యే అవకాశం ఉన్న అభ్యర్థులకు (Zone of Consideration) వారి వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్లు పంపనున్నట్లు వివరించారు. కాల్ లెటర్ అందుకున్న అభ్యర్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. అయితే, వెరిఫికేషన్‌కు హాజరయ్యే ముందే తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలని స్పష్టం చేశారు.

ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు 3 సెట్ల జిరాక్స్‌లు

వెరిఫికేషన్ సమయంలో అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్ల(Original certificates)తో పాటు, ఇటీవల తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం, గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించిన మూడు సెట్ల జిరాక్స్ కాపీలు, 5 పాస్‌పోర్ట్ సైజు ఫొటోలను తీసుకురావాలని సూచించారు. ఏయే సర్టిఫికెట్లు తీసుకురావాలో తెలిపే పూర్తి చెక్‌లిస్ట్‌ను కూడా డీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. నిర్దేశిత సమయంలో వెరిఫికేషన్‌కు హాజరుకాని లేదా సరైన పత్రాలు సమర్పించని అభ్యర్థులు తమ అవకాశాన్ని కోల్పోతారని, మెరిట్‌లో తర్వాతి స్థానంలో ఉన్నవారికి ఆ అవకాశం దక్కుతుందని హెచ్చరించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు దళారులు చేసే మోసపూరిత ప్రచారాలను, సోషల్ మీడియాలో వ్యాపించే అసత్య వదంతులను నమ్మవద్దని అభ్యర్థులను ప్రభుత్వం గట్టిగా హెచ్చరించింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *