
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి (SLPRB) 2025 ఏపీ పోలీసు కానిస్టేబుల్ తుది ఫలితాలు(AP Constable Final Results) విడుదలయ్యాయి. ఈ మేరకు హోంమంత్రి వి.అనిత(Anita AP Home Minister) ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. మొత్తం 6100 పోస్టులకు 6,024 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. అభ్యర్థులు తమ ఫలితాలను SLPRB అధికారిక వెబ్‌సైట్ slprb.ap.gov.inలో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 6,100 కానిస్టేబుల్ పోస్టులను (సివిల్, APSP) భర్తీ చేయనున్నారు. కాగా అక్టోబర్ 2022లో కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్(Notification) రాగా.. 2023 జనవరిలో రాత పరీక్ష జరిగిన విషయం తెలిసిందే.
ఎంపికైన అభ్యర్థులకు సెప్టెంబర్ 1 నుంచి శిక్షణ
కాగా గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఫలితాలను న్యాయపరమైన సవాళ్లు, పారదర్శకంగా పరిశీలించి విడుదల చేసినట్లు హోంమంత్రి తెలిపారు. అందుకోసమే రిజల్ట్స్ ఆలస్యమయ్యాయని చెప్పారు. ఇక, ఈ ఫలితాల్లో గండి నానాజి(వైజాగ్) 168 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచినట్లు అధికారులు ప్రకటించారు. ఎంపికైన అభ్యర్థులకు సెప్టెంబర్ 1 నుంచి శిక్షణ ఇస్తామని తెలిపారు. 9 నెలల్లో వారికి పోస్టింగ్ ఇస్తామన్నారు. కాగా ఫలితాల్లో జి.రమ్య మాధురి(విజయనగరం) 159 మార్కులతో రెండో స్థానం, మెరుగు అచ్యుతారావు(రాజమండ్రి) 144.5 మార్కులతో మూడో స్థానంలో నిలిచారు. అలాగే త్వరలో కానిస్టేబుళ్ల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేస్తామని హోంమంత్రి అనిత వెల్లడించారు. డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా(DGP Harish Kumar Gupta), ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
పోలీస్ కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలీస్ కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల చేసిన హోం మంత్రి అనిత
మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో ఫలితాలు విడుదల చేసిన హోం మంత్రి
పాల్గొన్న డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, ఉన్నతాధికారులు#VangalapudiAnitha… pic.twitter.com/ci7iUrYxUE
— Telugu Stride (@TeluguStride) August 1, 2025