APPSC బంపర్ ఆఫర్.. కొత్త రిక్రూట్‌మెంట్ నోటీసులు విడుదల

రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) త్వరలోనే భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల( Notices Released) చేయనుంది. ప్రస్తుతం మొత్తం 18 నోటిఫికేషన్లు సిద్ధంగా ఉండగా, అందులో 12కుపైగా క్యారీ ఫార్వర్డ్ పోస్టులకు సంబంధించినవిగా తెలుస్తోంది. అయితే ఈసారి పోస్టుల సంఖ్య తక్కువగానే ఉండే అవకాశం ఉంది.

వివరాల్లోకి వెళ్తే.. జిల్లా సైనిక వెల్ఫేర్, వ్యవసాయ అధికారి, దేవాదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్‌లో టెక్నికల్ అసిస్టెంట్, ఫారెస్టులో డ్రాఫ్ట్స్‌మెన్ గ్రేడ్-2, హార్టీకల్చర్ ఆఫీసర్, ఫిషరీస్ అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్, మైన్స్ రాయల్టీ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ ఇంజినీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, హాస్పిటల్ వెల్ఫేర్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్-కం-టైపిస్ట్ వంటి పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. రాష్ట్రంలోని పరీక్షా కేంద్రాల లభ్యతను బట్టి రాత పరీక్షల తేదీలు ఖరారు చేసి, అనంతరం అధికారికంగా నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. సమాచారం ప్రకారం, ఒక నోటిఫికేషన్‌లో గరిష్టంగా 4 పోస్టులే ఉండటంతో, ఈసారి మొత్తం ఖాళీలు పరిమితంగా ఉండే అవకాశం ఉంది.

ఇక కేంద్ర స్థాయిలో కూడా నియామకాల ప్రక్రియ కొనసాగుతోంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్ పరీక్షల అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ చేసి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రాత పరీక్ష ఆగస్టు 12న ఆన్‌లైన్ విధానంలో దేశవ్యాప్తంగా పలు కేంద్రాల్లో జరగనుంది. స్వంత స్క్రైబ్ ఎంచుకున్న అభ్యర్థుల వివరాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఈ నోటిఫికేషన్ కింద కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల్లో హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టుల భర్తీ జరగనుంది. ప్రస్తుతం మొత్తం 437 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా తుది నియామకాలు చేపడతారు.

Related Posts

AI: ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? ఈ ఐదు కోర్సులు పూర్తిగా ఉచితం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI) డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో విద్యా మంత్రిత్వ శాఖ మంచి అవకాశాన్ని కల్పించింది. దేశవ్యాప్తంగా విద్యార్థులు, ఉద్యోగులు, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే విధంగా ‘స్వయం పోర్టల్‌’ ద్వారా ఉచిత ఏఐ కోర్సులను( Free AI courses)…

Job Offer: డిగ్రీ అవసరం లేదు.. నెలకు లక్షల్లో జీతం.. ఈ జాబ్‌కి ఇలా అప్లై చేసుకోండి!

ఉద్యోగ(Job) అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. డిగ్రీ లేకపోయినా(No Degree Required), హైస్కూల్ చదువుతున్నవారికీ ఇప్పుడు బంపర్ ఛాన్స్ వచ్చింది. భారతీయ స్టార్టప్ పచ్ AI నెలకు రూ.2 లక్షల వరకు స్టైపెండ్ ఇచ్చే ఇంటర్న్‌షిప్‌లను ప్రకటించింది. AI Engineer,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *