ప్రతిష్ఠాత్మక ఫిడే ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత యువ గ్రాండ్ మాస్టర్ ఇరిగేసి అర్జున్..సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. మంగళవారం జరిగిన క్వార్టర్స్‌లో అర్జున్ 53 ఎత్తుల్లో భారత్‌కే చెందిన ఆర్ ప్రజ్ఞానందపై అద్భుత విజయం సాధించాడు.
మరో క్వార్టర్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ ప్లేయర్ మాగ్నస్ కార్ల్‌సన్ చేతిలో గుకేశ్ ఓటమిపాలయ్యాడు. నల్లపావులతో బరిలోకి దిగిన కార్ల్‌సన్..గుకేశ్‌కు చెక్‌పెడుతూ సెమీస్‌లోకి వెళ్లాడు. విదిత్ గుజరాతి, నిజాత్ అబసోవ్‌తో క్వార్టర్స్ పోరులో తలపడనున్నాడు. మొత్తంగా మెగాటోర్నీలో నలుగురు భారత జీఎంలు క్వార్టర్స్‌లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.
వరల్డ్ కప్ చెస్ క్వార్టర్‌ఫైనల్ తొలి గేమ్‌లో విజయం సాధించిన తెలుగు గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి..రెండో గేమ్‌లో పరాజయం పాలయ్యాడు. బుధవారం జరిగిన రెండో గేమ్‌లో నల్లపావులతో ఆడిన గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద 75 ఎత్తుల్లో అర్జున్‌పై గెలుపొందాడు. దాంతో వీరిద్దరి మధ్య గురువారం టైబ్రేకర్ నిర్వహించడం ద్వారా సెమీఫైనల్‌కు చేరే ఆటగాడిని నిర్ణయించనున్నారు. ఇక భారత్‌కు చెందిన గ్రాండ్‌మాస్టర్లు, విదిత్ గుజరాతీ, డి.గుకేష్ టోర్నీ నుంచి నిష్క్రమించారు.
నిజాత్ అబసోవ్ (అజర్‌బైజాన్)తో క్వార్టర్‌ఫైనల్ తొలి గేమ్‌ను డ్రా చేసిన విదిత్..రెండో గేమ్‌లో 44 ఎత్తులలో పరాజయం చవిచూశాడు. దాంతో 1.5 పాయింట్లతో అబసోవ్ సెమీ్‌స చేరాడు. 17 ఏళ్ల గుకేష్ జోరు కూడా క్వార్టర్స్‌తోనే ముగిసింది. వరల్డ్ నెం.1 కార్ల్‌సన్‌తో మొదటి గేమ్‌లో ఓడిన గుకేష్ రెండో గేమ్‌లో నల్లపావులతో బరిలో దిగి ఓ దశలో కార్ల్‌సన్‌పై ఒత్తిడి కూడా తెచ్చాడు. కానీ గెలుపందుకోలేకపోయాడు. 59 ఎత్తుల తర్వాత గేమ్ డ్రా కావడంతో కార్ల్‌సన్ (1.5) సెమీఫైనల్లో అడుగుపెట్టాడు. ఇక, తన దేశానికే చెందిన లీనర్ పెరీజ్‌పై రెండో రౌండ్‌లో నెగ్గిన అమెరికన్ ఫాబినో కరువానా (1.5) కూడా సెమీస్ చేరాడు.