శిథిలావస్థలో అరుంధతి బంగ్లా.. పర్యాటకుల ఆవేదన

అరుంధతి(Arundati) సినిమా పేరు వినగానే చాలా మందికి గుర్తుకు వచ్చేది ఆ చిత్రంలో చూపించిన అద్భుతమైన కోట. నిజానికి ఆ కోట సినిమా కోసం నిర్మించిన సెట్ కాదు. ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా, బనగానపల్లి మండలం పాతపాడు గ్రామ శివారులో ఉన్న చారిత్రక నిర్మాణమే అది. సినిమా చిత్రీకరణ తర్వాత ప్రజలు దీనిని ‘అరుంధతి బంగ్లా’ అని పిలవడం ప్రారంభించారు.

ఈ కట్టడాన్ని బనగానపల్లి చివరి నవాబు మీర్‌ ఫజల్‌ అలీఖాన్‌ సుమారు 120 ఏళ్ల క్రితం నిర్మించారు. కాలక్రమంలో ఇది ప్రాంతీయ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. కేవలం అరుంధతి మాత్రమే కాకుండా, అనేక తెలుగు సినిమాలు, సీరియళ్లు ఇక్కడ చిత్రీకరించబడ్డాయి. ఫోటో షూట్‌లు, వీడియో ఆల్బమ్‌లు కూడా ఇక్కడ ఎక్కువగానే జరుగుతాయి.

Arundhati Kota Exclusive 4K Drone Shots | Facebook

చారిత్రక ప్రాధాన్యతతో పాటు, ఈ బంగ్లా పర్యాటకంగాను ఎంతో ప్రాముఖ్యమైనది. అయితే, ప్రస్తుతం ఈ అందమైన కట్టడం శిథిలావస్థకు చేరింది. గోడలు పగిలిపోవడం, పైకప్పులు కూలిపోవడం, తోటలు పాడైపోవడం వంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. నవాబు వారసులమని చెప్పుకునే కొందరు సందర్శకుల నుండి ప్రవేశ రుసుము వసూలు చేస్తున్నప్పటికీ, భవనం సంరక్షణకు సరైన చర్యలు తీసుకోవడం లేదు.

పర్యాటకులు, స్థానికులు, ఈ చారిత్రక బంగ్లాను రక్షించేందుకు ప్రభుత్వ విభాగాలు ముందుకు రావాలని కోరుతున్నారు. ఇది మరమ్మతులు చేసి పర్యాటక స్థలంగా అభివృద్ధి చేస్తే, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు జరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. అరుంధతి సినిమా ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ కట్టడం, సక్రమంగా సంరక్షిస్తే భవిష్యత్ తరాలకు ఒక అద్భుతమైన చారిత్రక వారసత్వంగా నిలుస్తుందని పర్యాటకులు అంటున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *