విజయనగరం సంస్థానాధీశుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు(Pusapati Ashoka Gajapati Raju) గోవా గవర్నర్(Goa Governor)గా ప్రమాణస్వీకారం(swearing in) చేశారు. బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే(Bombay High Court Chief Justice Alok Aradhe) శనివారం ఉదయం 11.30 గంటలకు అశోక్ గజపతిరాజుతో ప్రమాణం చేయించారు. రాజ్‌భవన్ బంగ్లా దర్బార్ హాల్లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ మేరకు శుక్రవారం కుటుంబ సభ్యులతో గోవా చేరుకున్న ఆయన, రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో నేడు గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, మంత్రివర్గ సభ్యులు, కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు, ఏపీ మంత్రులు నారా లోకేశ్(Nara Lokesh), సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్‌తో పాటు పలువురు TDP ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం
కాగా అశోక్ గజపతి రాజు నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితంలో ఏడుసార్లు MLAగా, ఒకసారి MPగా, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 25 ఏళ్లు, 13 ఏళ్లపాటు రాష్ట్ర మంత్రిగా వివిధ శాఖలను నిర్వహించారు. గవర్నర్ నియామకాన్ని రాష్ట్రపతి భవన్ అధికారికంగా ప్రకటించింది. ఈ నియామకం ఉత్తరాంధ్రకు గర్వకారణంగా నిలిచింది.
Ashok Gajapathi Raju sworn in as the new Governor of Goa! 🏛️ Congratulations to him on assuming the prestigious office. Wishing him a successful tenure in service of the state. #Goa #Governor #India pic.twitter.com/VON76sfmRk
— 🇮🇳Tirish Reddy (@tirishreddy) July 26, 2025






