
తనను ఎంతగా విమర్శిస్తే అంతగా ఎదుగుతానని TVK పార్టీ అధ్యక్షుడు, తమిళ అగ్ర నటుడు విజయ్(Actor Vijay) పేర్కొన్నారు. తమ భావజాల శత్రువు BJP, రాజకీయ విరోధి DMK అని ఆయన స్పష్టం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేకు, తమ పార్టీకి మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటి తలుపు తడతామని తెలిపారు. మదురై(Madurai)లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో విజయ్ ప్రసంగిస్తూ, అసెంబ్లీ ఎన్నికల్లో విప్లవం సృష్టిస్తామని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను మధురై ఈస్ట్ నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.
తమిళుడికే ప్రాధాన్యం ఇస్తాం..
“కులం కాదు.. మతం కాదు తమిళుడికే ప్రాధాన్యం ఇస్తాం” అని ఆయన ఉద్ఘాటించారు. BJPతో చేతులు కలిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మనుగడ కోసమే ఇతర పార్టీలు పొత్తులు పెట్టుకుంటున్నాయని విమర్శించారు. మనం RSS ముందు ఎందుకు తలవంచాలని ఆయన ప్రశ్నించారు. తమిళ అస్తిత్వాన్ని ప్రతిపక్షాలు తగ్గిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వారికి స్వేచ్ఛ కల్పిస్తామని హామీ
కచ్చతీవులకు శ్రీలంక(Srilanka) నుంచి స్వేచ్ఛ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) ఢిల్లీలో రహస్య సమావేశాలు జరుపుతున్నారని ఆరోపించారు. ఆయన పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. 2024 ఫిబ్రవరిలో టీవీకేను స్థాపించినప్పటి నుంచి భారీ సభను నిర్వహించడం ఇది రెండోసారి. గత ఏడాది విల్లుపురం జిల్లాలోని విక్రవందిలో మొదటి సభను నిర్వహించారు.
VIJAY * MGR * VIJAYAKANTH 🔥🔥
#TVKMaduraiMaanadu #Stalinunclepic.twitter.com/yhNHmXWldp
— ᗰIᑕᕼᗩEᒪ 🥊 (@Michealtweets) August 21, 2025