ADR Report 2025: దేశంలో అత్యంత ధనిక సీఎం చంద్రబాబు.. అత్యధిక క్రిమినల్ కేసులు ఏ సీఎంపైనో తెలుసా?

దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల(CM)పై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫామ్స్ సంచలన నివేదిక (Association for Democratic Reforms Report 2025) వెలువరించింది. ఇందులో దేశంలోని 30 మంది సీఎంల ఆస్తులు, క్రిమినల్ కేసులు(Criminal Cases), విద్యార్హతల వివరాలు వెల్లడించింది. ఈ మేరకు దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu naidu) రూ.931 కోట్ల ఆస్తులతో టాప్‌లో నిలిచారు. ఆయన ఆస్తుల్లో హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు, భార్య భువనేశ్వరి పేరిట రూ.895 కోట్ల స్థిర, చరాస్తులు ఉన్నాయి.

అతి తక్కువ ఆస్తులు కలిగిన సీఎంగా మమతా బెనర్జీ

ఇక రెండో స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పేమా ఖండూ (రూ.332 కోట్లు), మూడో స్థానంలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య (రూ.51.93 కోట్లు) ఉన్నారు. అతి తక్కువ ఆస్తులు కలిగిన సీఎంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (రూ.15 లక్షలు) నిలిచారు. 30 మంది సీఎంల సగటు ఆస్తి రూ.52.59 కోట్లుగా ఉంది. ఇది దేశ సగటు తలసరి ఆదాయం (రూ.1.85 లక్షలు) కంటే 7.3 రెట్లు ఎక్కువ. కాగా మణిపుర్‌లో రాష్ట్రపతి పాలన కారణంగా ప్రస్తుతం అక్కడ సీఎం పదవిలో లేడు.

10 మంది సీఎంలపై తీవ్ర నేరాలకు సంబంధించిన కేసులు

ఇదిలా ఉండగా అత్యధిక క్రిమినల్ కేసుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(TG CM Revanth Reddy) అగ్రస్థానంలో ఉన్నారు. ఆయనపై 89 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో 72 తీవ్రమైన నేరాలకు సంబంధించినవి. రెండో స్థానంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (47 కేసులు), మూడో స్థానంలో చంద్రబాబు నాయుడు (19 కేసులు) ఉన్నారు. మొత్తం 30 మంది సీఎంలలో 13 మందిపై (42%) క్రిమినల్ కేసులు, 10 మందిపై తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి.

సీఎంలలో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవే..

ఇక ఎక్కువ చదువుకున్న సీఎంలు జాబితాలో డాక్టరేట్లు ఇద్దరు, పోస్టు గ్రాడ్యుయేట్లు 8 మంది, గ్రాడ్యుయేట్ ప్రొఫేషనల్స్ ఆరుగురు, గ్రాడ్యుయేట్లు 9 మంది, 12th పాస్ ముగ్గురు, 10th పాస్ ఇద్దరు, డిప్లొమా ఒకరు పూర్తి చేశారు. ఎన్నికల సమయంల్లో వీరు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ఈ నివేదికను రూపొందించినట్లు ఏడీఆర్ పేర్కొంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *