పింక్ బాల్ టెస్టు(Pink Ball Test) తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా(Australia) 337 భారీ స్కోరు సాధించింది. భారత బ్యాటర్లు ఒక్కో పరుగుకోసం ఆపసోపాలు పడిన అడిలైడ్(Adelaide) పిచ్‌పై ఆతిథ్య జట్టు పరుగుల వరద పారించింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 157 పరుగుల లీడ్ సాధించింది. ఆసీస్ బ్యాటర్లను అడ్డుకోవడంలో భారత బౌలర్లు చెమటోడ్చాల్సి వచ్చింది. ఆ జట్టులో హెడ్(Travis Head) 140 సూపర్ సెంచరీతో చెలరేగాడు. స్వీనీ 39, లబుషేన్ 64 రన్స్ చేశారు. భారత బౌలర్లలో బుమ్రా 4, సిరాజ్ 4, నితీశ్, అశ్విన్ ఒక్కో వికెట్ పడగొట్టారు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 180 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.
ట్రావిస్ హెడ్ వరల్డ్ రికార్డు
టీమిండియా(Team India) అంటేనే చెలరేగిపోయే ట్రావిస్ హెడ్(Head) మరోసారి మన బౌలర్లకు చుక్కలు చూపించాడు. గతేడాది WTC ఫైనల్, ODI WC ఫైనల్ మరోసారి గుర్తు చేస్తూ.. అడిలైడ్ లో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో సెంచరీ(Century) బాదాడు. రెండో రోజు ఆటలో హెడ్ కేవలం 111 బంతుల్లోనే సెంచరీ చేయడం విశేషం. రెండేళ్ల కిందట ఇంగ్లండ్ పై 112 బంతుల్లో సెంచరీ చేసి నెలకొల్పిన తన రికార్డును తానే తిరగరాశాడు.
అడిలైడ్‌లో 3వ సెంచరీ
అడిలైడ్‌లోనే 2022లో వెస్టిండీస్‌తో జరిగిన మరో డేనైట్ టెస్టులోనూ హెడ్ 125 బంతుల్లో సెంచరీ చేశాడు. అడిలైడ్‌లో అతనికిది 3వ సెంచరీ. రెండో రోజు తొలి సెషన్‌లో స్మిత్ కేవలం 2 పరుగులకే ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన హెడ్.. అలవోకగా ఇండియన్ బౌలర్లను ఎదుర్కొన్నాడు. ఇండియన్ పేసర్లను అటాక్ చేస్తూ ఒత్తిడిలోకి నెట్టాడు. బుమ్రా బౌలింగ్‌లో ఆచితూచి ఆడినా.. హర్షిత్ రాణాను చితకబాదాడు. ప్రస్తుతం భారత్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది.
Australian Crowd booing you means you are on right path💉✨
They boo even King Virat Kohli in Past. #INDvsAUSpic.twitter.com/dDWVd0hh4R— Mufaddal Parody (@mufaddal_voira) December 7, 2024








