WTC Final 2025: రసవత్తరంగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్.. లీడ్‌లో ఆసీస్

లార్డ్స్(Lords) వేదికగా ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్(World Test Championship Final) రసవత్తరంగా సాగుతోంది. బౌలర్ల ఆధిపత్యం కొనసాగుతున్న ఈ మ్యాచు తొలి ఇన్నింగ్స్‌లో ఇరు జట్లు స్పల్ప స్కోర్లకే కుప్పకూలాయి. తొలుత ఆస్ట్రేలియా(Australia) 212/10 రన్స్ చేయగా.. దానికి బదులుగా సౌతాఫ్రికా(South Africa) కేవలం 57.1 ఓవర్లలోనే 138 పరుగులకే కుప్పకూలింది. ప్రొటీస్ బ్యాటర్లలో బవుమా (36), బెడింగమ్ (45), రికెల్టన్ (16) రన్స్ మినహా మిగతా వారంతా విఫలమయ్యారు. కంగారూ బౌలర్లలో కెప్టెన్ కమిన్స్(Cummins) 6 వికెట్లతో చెలరేగాడు. స్టార్క్ 2, హేజిల్ వుడ్ ఒక వికెట్ తీశారు.

218 పరుగుల ఆధిక్యంలో ఆస్ట్రేలియా

అనంతరం 74 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లోనూ తడబడింది. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి కంగారూ జట్టు 40 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 144 రన్స్ చేసింది. లబుషేన్ (22), క్యారీ (43) రన్స్ చేశారు. ప్రస్తుతానికి 218 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. సౌతాఫ్రికా(South Africa) బౌలింగ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లతో చెలరేగిన రబాడ(Rabada) రెండో ఇన్నింగ్స్‌లోనూ 3 వికెట్లు తీశాడు. ఎంగిడి 3, జాన్సెన్, మల్డర్ చెరో వికెట్ పడగొట్టారు. కాగా బౌలర్లకు సహకరిస్తున్న పిచ్‌పై కంగారూలను ఎదుర్కొని టార్గెట్‌ను ఛేదించడం సఫారీలకు కత్తిమీద సామే కావొచ్చని క్రికెట్ మాజీలు అభిప్రాయపడుతున్నారు.

 

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *