ఆస్ట్రేలియాలో జరిగిన తొలి వన్డేలో భారత మహిళల(AUSW vs INDW) జట్టు ఘోర పరాజయం చవిచూసింది. గురువారం బ్రిస్బేన్‌లోని అలెన్ బోర్డర్ ఫీల్డ్ వేదిక(Allan Border Field, Brisbane)గా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ 5 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్‌లో తొలుత టీమ్ ఇండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(Captain Harmanpreet Kaur) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ పవర్‌ప్లే(Power play)లోనే భారత కెప్టెన్ నిర్ణయం తప్పని కంగారూ బౌలర్లు నిరూపించారు. దీంతో తొలి పది ఓవర్లలోనే భారత్ స్మృతి మంధాన (8), ప్రియా పునియా (3), హర్లీన్ డియోల్ (19) వికెట్లను కోల్పోయింది.
ఈ దశలో మిడిలార్డర్‌లో వచ్చిన హర్మన్‌ప్రీత్ కౌర్ (17) పరుగులు చేసి పెవిలియన్ చేరింది. టాప్ స్కోర్ జెమీమా రోడ్రిగ్స్ (23) రన్స్ చేసి ఔట్ అయింది. ఆ తర్వాత రిచా ఘోష్ 14 పరుగులు చేసినా, మిగతా బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్(Single digit)కే పరిమితమయ్యారు. దీంతో టీమ్ ఇండియా(Team India) 34.2 ఓవర్లలో 100 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
ఆడుతూ.. పాడుతూ..
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ఆసీస్(Aussies) 5 వికెట్లు కోల్పోయి ఆడుతూ..పాడుతూ.. టార్గెట్‌ను అందుకుంది. 101 పరుగుల సులువైన లక్ష్య ఛేదనలో ఆ జట్టుకు ఫోబ్ లిచ్ ఫీల్డ్, జార్జియా వాల్(Phoebe Litchfield, Georgia Wall) శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 48 పరుగులు చేసిన తర్వాత ఫోబ్ (35) ఔట్ అయింది. ఈసారి బరిలోకి దిగిన ఎల్లిస్ పెర్రీ (1), బెత్ మూనీ (1) రేణుకా సింగ్ పెవిలియన్ చేర్చింది. స్వల్ప వ్యవధిలో భారత్ మూడు వికెట్లు పడగొట్టినా.. మరోవైపు జార్జియా వోలే క్రీజులో నిలదొక్కుకుంది. 42 బంతుల్లో అజేయంగా 46 పరుగులు చేసి జట్టును 16.2 ఓవర్లలో విజయతీరాలకు చేర్చింది. దీంతో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 5 వికెట్లతో సత్తా చాటిన ఆసీస్ బౌలర్ మెగాన్ స్కట్(Megan Shcutt)కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్(Player of the match)’ అవార్డు దక్కింది. కాగా ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఇదే వేదికపై ఆదివారం (డిసెంబర్ 8న) జరగనుంది.
🏏𝗔𝘂𝘀𝘁𝗿𝗮𝗹𝗶𝗮 (𝗪𝗼𝗺𝗲𝗻) 𝗱𝗲𝗳𝗲𝗮𝘁 𝗜𝗻𝗱𝗶𝗮 𝗯𝘆 𝟱 𝘄𝗶𝗰𝗸𝗲𝘁𝘀 𝗶𝗻 𝘁𝗵𝗲 𝗳𝗶𝗿𝘀𝘁 𝗢𝗗𝗜
𝐁𝐫𝐢𝐞𝐟 𝐒𝐜𝐨𝐫𝐞:
INDW 100 (34.2)
AUSW 102/5 (16.2)#INDvAUS | #Cricket | #WODI | #AUSvsIND pic.twitter.com/LYWHV2kXta— All India Radio News (@airnewsalerts) December 5, 2024








