బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండు టెస్టులో భారత్(Aus vs Ind) తడబడుతోంది. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 128 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం భారత్ 29 రన్స్ వెనుకబడి ఉంది. టీమ్ఇండియాలో జైస్వాల్ 24, రాహుల్ 7, గిల్ 28, కోహ్లీ 11, రోహిత్ 6 మరోసారి తీవ్రంగా నిరాశపర్చారు. ప్రస్తుతం క్రీజులో పంత్ (28 నాటౌట్), నితీశ్ (15 నాటౌట్) ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, బొలాండ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. స్టార్క్(Starc) ఒక వికెట్ తీశాడు. కాగా రేపు ఉదయం 9.30 గంటలకు మూడో రోజు ఆట ప్రారంభమవుతుంది.
జట్టుకు భారంగా మారొద్దు..
ఓ పక్క ఆసీస్ బ్యాటర్లు సులభంగా పరుగులు రాబట్టిన పిచ్‌పై టీమ్ఇండియా(Team India) బ్యాటర్లు తడబడ్డారు. క్రీజులో నిలబడేందుకే ఆపసోపాలు పడ్డారు. దీంతో వచ్చీ రాగానే పెవిలియన్ బాట పట్టారు. జట్టును ఆదుకోవాల్సిన సీనియర్ బ్యాటర్లు కోహ్లీ(Kohli), రోహిత్(Rohit) తీవ్రంగా నిరాశపర్చుతున్నారు. రోహిత్ గత 12 ఇన్నింగ్స్‌లో కేవలం ఒకే ఒక్క హాఫ్ సెంచరీ సాధించాడు. మిగతా అన్ని ఇన్నింగ్స్‌లో దారుణంగా విఫలమై జట్టుకు భారంగా మారుతున్నాడు. ఇలా అయితే హిట్ మ్యాన్(Hit man) టెస్టుల్లో ఎక్కువ రోజులు కొనసాగే అవకాశాలు లేవని క్రికెట్ మాజీలు, అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
ఆసీస్‌కు 157 రన్స్ లీడ్
అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా(Australia) 337 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్‌పై 157 పరుగుల ఆధిక్యం సాధించింది. ఆ జట్టులో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ట్రావిస్ హెడ్(Travis Head) వన్డే తరహా బ్యాటింగ్ చేసి ఆకట్టుకున్నాడు. 141 బంతుల్లో 140 రన్స్ చేసి రాణించాడు. లబుషేన్ 64, స్వీనీ 39 రన్స్ చేశారు. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్ చెరో నాలుగు వికెట్లు కూల్చారు. అశ్విన్, నితీశ్ చెరో వికెట్ తీశారు. కాగా భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 180 రన్స్‌కే కుప్పకూలిన విషయం తెలిసిందే.
I am 23 years old watching Cricket since 2007 and I have never seen Rohit Sharma stepping up for India outside India #INDvAUS pic.twitter.com/NewO4wFiMT
— Aarav (@sigma__male_) December 7, 2024








