మంచు మనోజ్(Manchu Manoj)నటించిన ‘భైరవం(Bhairavam)’ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా హీరో మంచు మనోజ్ ‘X’ వేదికగా ఆసక్తికర పోస్ట్(Post) పెట్టాడు. ‘పెదరాయుడు(Pedarayudu Movie)’ మూవీలోని మోహన్ బాబు(Mohan Babu) ఫొటో పక్కన తన ఫొటో(Photo)ను ఎడిట్ చేసి పంచుకున్నాడు. పైగా దానికి “ఆయన కొడుకు వచ్చాడని చెప్పు” అనే క్యాప్షన్ రాసుకొచ్చాడు.
మోహన్ బాబుతో వివాదాల వేళ..
కాగా, తండ్రి మోహన్ బాబుతో వివాదాలు కొనసాగుతున్న వేళ ఆయన ఈ పోస్టు చేయడం గమనార్హం. తన తండ్రి పాదాలను తాకాలని ఉందంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మనోజ్ భావోద్వేగానికి గురైన విసయం విషయం తెలిసిందే.
తొమ్మిదేళ్ల తర్వాత..
ఇదిలాఉంటే… మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas), నారా రోహిత్(Nara Rohith) కలిసి చేసిన చిత్రం ‘భైరవం’ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ కనకమేడల(Vijay Kanakamedala) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి ఇప్పటి వరకు ప్రమోషన్స్(Promotions) కూడా బాగానే చేశారు. మనోజ్ సినిమాలకు దాదాపు తొమ్మిదేళ్లు దూరమైన తర్వాత చేసిన మూవీ ఇదే కావడం గమనార్హం.






