BSNL Freedom Plan: అదిరిపోయే ఆఫర్.. రూ.1కే 30 రోజుల అన్‌లిమిటెడ్ సర్వీస్

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) దేశవ్యాప్తంగా తన ప్రీపెయిడ్ వినియోగదారుల(Prepaid Users)కు గుడ్‌న్యూస్ చెప్పింది. ఇండిపెండెన్స్ డే(Independence Day) సందర్భంగా “ఆజాదీ కా ప్లాన్(Azadi Ka Plan)” పేరిట యూజర్ల కోసం”ఫ్రీడమ్ ప్లాన్”ను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా కేవలం రూ.1కే 30 రోజుల అపరిమిత సేవలను అందిస్తుంది. ఈ ఆఫర్‌ కొత్త(New Offer) వినియోగదారులకు మాత్రమే! ఈ మేరకు BSNL ఎక్స్‌లో పోస్టు చేసింది.

BSNL all set to launch 4G services, introduces new recharge plans |  Technology News – India TV

ఈ ప్లాన్‌లో భాగంగా రూ.1కే 30 రోజుల పాటు అపరిమిత వాయిస్‌ కాల్స్‌(Unlimited Calls), రోజుకు 100 SMSలు, రోజుకు 2GB డేటాను BSNL అందిస్తోంది. సిమ్‌ కూడా ఫ్రీ. ఈ ఆఫర్‌ ఆగస్టు 1 నుంచి 31 వరకు చెల్లుబాటులో ఉంటుంది. ఆసక్తి గల వినియోగదారులు ఈ ఆఫర్‌ కోసం సమీపంలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ సర్వీస్‌ సెంటర్‌ (CSC)కు లేదా రిటైలర్‌ను సందర్శించొచ్చు. కొత్త వినియోగదారులను ఆకర్షించడానికి, 4G సేవలను విస్తరించడమే లక్ష్యంగా సంస్థ ఈ ప్లాన్‌ను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

బీఎస్‌ఎన్‌ఎల్ డైరెక్టర్ శ్రీ ఆర్.కె. మిట్టల్(RK Mittal) మాట్లాడుతూ, ఈ ప్లాన్ అన్ని వర్గాల వినియోగదారులకు అనువైనదని, కుటుంబం, స్నేహితులతో సంప్రదింపులు కొనసాగించడానికి ఇది సహాయపడుతుందని తెలిపారు. ఈ ప్లాన్ ప్రస్తుతం ప్రమోషనల్ ఆఫర్‌(Promotional Offer)గా అందుబాటులో ఉంది, ఇది రిలయన్స్ జియో(Reliance Jio) వంటి పోటీదారులతో పోటీపడేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగమని ఆయన అన్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *