నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా బాబీ (Bobby) దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ సినిమా ‘డాకు మహారాజ్ (Daaku Maharaaj)’. ఫుల్ ఆన్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదలైన విషయం తెలిసిందే. సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని పది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ. 170 కోట్లకు పైగా వరకు గ్రాస్, రూ.85 కోట్లకుపైగా షేర్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాతో బాలయ్య వరుసగా నాలుగు సార్లు వంద కోట్ల కలెక్షన్లు రాబట్టిన సీనియర్ హీరోగా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు.
డిజిటల్ స్ట్రీమింగ్ అప్పుడే
ఇక థియేటర్లలో ఇంకా రన్ అవుతున్న ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఇప్పుడు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ఓటీటీలో సందడి చేయబోతోందంటూ సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో దీని డిజిటల్ స్ట్రీమింగ్ జరగనున్నట్లు సమాచారం.
ఫిబ్రవరి 9 నుంచి
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ (Netflix) వేదికగా ‘డాకు మహారాజ్’ ఫిబ్రవరి 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్టింట న్యూస్ వైరల్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిసింది. అయితే దీనిపై నెట్ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ నటించారు.






