టాలీవుడ్లో రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఇటీవల మహేశ్ బాబు నటించిన ఖలేజా విడుదలై రికార్డు కలెక్షన్స్ రాబట్టింది. ఈ నేపథ్యంలో ఈనెల 10న బాలకృష్ణ (Nandamuri Balakrishna) బర్త్‌డేను పురస్కరించుకొని ఆయన ఆసిన్ జంటగా నటించిన సూపర్ హిట్ మూవీ లక్ష్మీ నరసింహ మూవీని సైతం రీరిలీజ్ (Lakshmi Narasimha Re Release) చేయనున్నారు. బాలయ్య బర్త్‌డేకు రెండు రోజుల ముందుగానే జూన్ 8న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్నారు.
బాక్సాఫీస్ వద్ద భారీ హిట్
ఈ నేపథ్యంలోనే తాజాగా లక్ష్మీ నరసింహా మూవీ రీ రిలీజ్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో 2004లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ సాధించింది. బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్‌గా ప్రేక్షకులను మెప్పించారు. ఈ సినిమాలో ఆయన చెప్పిన డైలాగులు ఇప్పటికీ సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటాయి. ఈ నేపథ్యంలోనే రీరిలీజ్ చేస్తున్న లక్ష్మీ నరసింహా ట్రైలర్‌ను మీరూ చూసేయండి.






