తెలుగు బుల్లితెరపై అత్యంత పాపులర్ అయిన రియాల్టీ షో బిగ్ బాస్ (Bigg Boss 9 Telugu). ఇప్పటి వరకు ఎనిమిది సీజన్లు విజయవంతంగా కంప్లీట్ చేసుకుంది. ఒక సీజన్ ఓటీటీ వెర్షన్ కూడా వచ్చింది. త్వరలోనే బిగ్ బాస్ తొమ్మిదో సీజన్ ప్రారంభం కాబోతోంది. అయితే ఈ సీజన్ కు కొత్త హోస్టును తీసుకురావాలని నిర్వాహకులు యోచిస్తున్నట్లు సమాచారం. మొదటి సీజన్ కు హోస్టుగా ఎన్టీఆర్ (NTR) వ్యవహరించారు. రెండో సీజన్ కు నాని (Nani Bigg Boss) వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఇక మూడో సీజన్ నుంచి ఎనిమిదో సీజన్ వరకు ఓటీటీ వెర్షన్ తో కలిపి నాగార్జున (Nagarjuna) హోస్టుగా చేశారు.
బిగ్ బాస్ హోస్టుగా బాలయ్య
అయితే ఈసారి కొత్త హోస్టును తీసుకురావాలని నిర్వాహకులు ప్లాన్ చేశారట. తెలుగు ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారని.. ఓ స్టార్ హీరోను హోస్టుగా తీసుకొచ్చే యోచన చేస్తున్నారట. అయితే ఆ హీరో ఎవరో కాదు.. నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna). ఈసారి బిగ్ బాస్ షో సీజన్ 9ను బాలయ్య బాబుతో హోస్టింగ్ చేయించనున్నారట. ఇదే నిజమైతే రాబోయే సీజన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని నెటిజన్లు అంటున్నారు. ఇప్పటికే బాలయ్య హోస్టుగా సక్సెస్ అయిన విషయం తెలిసిందే. అన్ స్టాపబుల్ షోతో బాలయ్య ఫుల్ క్రేజ్ సంపాదించాడు.
బాలయ్యతో చర్చలు
ఆ క్రేజ్ బిగ్ బాస్ షోకు బాగా ఉపయోగపడుతుందని నిర్వాహకులు భావిస్తున్నారట. బాలయ్యను తీసుకొస్తే షో రేటింగ్ కూడా పెరిగే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారట. ఇక బాలయ్య మాస్ ఇమేజ్, స్పాంటెనిటీ ఈ షోకు చాలా యూజ్ అవుతుందని భావిస్తున్నట్లు సమాచారం. బాలకృష్ణతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. సీజన్-9 త్వరలోనే ప్రారంభం కాబోతున్న దృష్ట్యా త్వరగా బాలయ్యను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారట. అయితే ఆయన ఇప్పటికే సినిమాలు, అన్ స్టాపబుల్ షో (Unstoppable with NBK)తో బిజీగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఓకే చెబుతారో లేదో చూడాల్సి ఉంది.






