బాలకృష్ణ మ్యాన్షన్ హౌజ్ అదుర్స్.. వీడియో చూస్తే మతిపోవాల్సిందే

నందమూరి నటసింహం బాలయ్య బాబు వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. యంగ్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ వరుసగా బ్లాక్ బస్టర్ హిట్ లను అందుకుంటున్నాడు. ఈ సంక్రాంతికి వరుసగా 4 బ్లాక్ బస్టర్ కొట్టిన బాలయ్య.. రీసెంట్ గా పద్మభూషణ్ అవార్డును కూడా దక్కించుకున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 తాండవం సినిమా చేస్తున్నాడు. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా అఖండ సీక్వెల్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

సాధారణంగా స్టార్ హీరోలు యాడ్‌ల్లో కనిపించడం సహజమే. మహేష్ బాబు థమ్సప్, వరుణ్ తేజ్ స్ప్రైట్, చిరంజీవి కంట్రీ డిలైట్ ఇలా చాల మంది హీరోలు యడ్స్ లో కనిపించరు. ఈ క్రమంలోనే బాలకృష్ణ కూడా ఇప్పుడు యాడ్స్‌ లోకి అడుగుపెట్టాడు.

తాజాగా బాలకృష్ణ చేసిన ఒక యాడ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే కొన్ని యాడ్స్ చేసిన బాలయ్య, తాజాగా మ్యాన్షన్ హౌజ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్ యాడ్‌లో కనిపించారు. ఈ యాడ్‌లో బాలయ్య సింహంపై సవారీ చేస్తూ రావడం కొత్తగా ఉంది. అలాగే సింహం పక్కన బాలయ్యను చూపించడం అదిరిపోయింది. ఈ యాడ్‌లో ఒక షూటర్ వచ్చి సింహాన్ని కాల్చబోతుండగా, ఆ సమయంలో బాలయ్య సింహంపై వచ్చి.. “అన్నిటినీ లవ్ చెయ్ లయన్ హార్ట్‌తో వెల్కమ్ చెయ్.. జిందగీలో ఏదైనా దిల్ ఓపెన్ చెయ్ లైఫ్ వెల్కమ్ చెయ్…” అంటూ చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. బాలయ్య మాస్ స్టైల్‌తో మళ్ళీ ట్రెండ్‌లోకి వచ్చేశాడు అని అభిమానులు ఫిదా అవుతున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *