
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను(Boyapati Srinu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అఖండ 2’ సినిమాపై ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మొదటి భాగంలోని బాలకృష్ణ అఘోర పాత్రకు ప్రేక్షకులు ఊగిపోయారు. ఇప్పుడు ఆ పాత్రను మరోసారి స్క్రీన్ మీద చూడాలని ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
తాజాగా విడుదలైన ‘అఖండ 2’(Akhanda2) టీజర్ దుమ్మురేపుతోంది. ముఖ్యంగా, “ఈశ్వరుడి ఆజ్ఞ లేకుండా యముడు కూడా ప్రాణాలు తీయడు… అలాంటిది నువ్వు అమాయకుల ప్రాణాలు తీయాలని అనుకుంటావా?” అనే డైలాగ్ పలికిన తీరు అభిమానులను గూస్‌బంప్స్ వచ్చాయి.
ఈ డైలాగ్ అనంతరం చూపించిన విలన్ కళ్ల సన్నివేశం ఇప్పుడు సోషల్ మీడియాలో హైలైట్‌గా మారింది. ఆ కళ్లపై పెద్ద చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్న ఆది పినిశెట్టి (Aadhi Pinishetty) కళ్లే అవి అని కామెంట్స్ చేస్తున్నారు. ఆయన కళ్ల తీరును బట్టి చూస్తే, ఈ చిత్రంలో అఘోర పాత్రలో నటించినట్టుగా కనిపిస్తోంది.
ఒకరిని మించి మరొకరు అనే విధంగా రెండు శక్తుల మధ్య గొప్ప యుద్ధంగా ఈ సినిమా ఉండబోతోందని టీజర్ చెప్పకనే చెబుతోంది. బాలయ్య బాబు మంచి అఘోర పాత్రలో నటిస్తే, ఆది పినిశెట్టి చెడు శక్తులవైపు ఉన్న అఘోర పాత్రలో కనిపించే అవకాశం ఉంది. ఓ వైపు ధర్మానికి నిలబడే శక్తి, మరోవైపు అధర్మాన్ని ప్రోత్సహించే శక్తి మధ్య యుద్ధంగా ‘అఖండ 2’ మలిచినట్లు తెలుస్తోంది.