టాలీవుడ్లో ప్రస్తుతం ఒక వార్త హాట్ టాపిక్‌గా మారింది. నందమూరి నటసింహం బాలకృష్ణ(Nandamuri Balakrishna) ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కోరిక ఇప్పుడు నెరవేరబోతోందట. దాదాపు 30 సంవత్సరాలుగా బాలయ్య గుండెల్లో ఉన్న ఆ కోరిక… ఈ నెల 10న, ఆయన పుట్టినరోజు సందర్భంగా నెరవేరబోతోందనే టాక్ వినిపిస్తుంది.
జూన్ 10న బాలయ్య పుట్టినరోజును ప్రతి సంవత్సరం నందమూరి అభిమానులు పండుగలా సెలబ్రేట్ చేస్తారు. తమ పుట్టిన రోజును మర్చిపోతారేమోగాని బాలయ్య బాబు పుట్టిన రోజును మాత్రం మర్చిపోరు ఫాన్స్. ఈసారి బాలయ్య పుట్టినరోజు మరింత ప్రత్యేకం కానుంది అంటూ అభిమానులు అంటున్నారు. బాలయ్య కొడుకు మోక్షజ్ఞ(Mokshagna ) సినీ రంగ ప్రవేశానికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ విడుదల కాబోతుందనే వార్త అందుకు కారణం అని తెలుస్తుంది.
ఇప్పటికే దర్శకుడు ప్రశాంత్ వర్మ డెబ్యూ సినిమాకి సంబంధించిన ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినా, అది క్యాన్సిల్ అయినట్టు సమాచారం. తాజాగా దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న “ఆదిత్య 999” సినిమాతో మోక్షజ్ఞ హీరోగా పరిచయం కాబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని బాలయ్య తన పుట్టినరోజున అధికారికంగా ప్రకటించనున్నారని టాక్. ఈ చిత్రంలో బాలకృష్ణ, మోక్షజ్ఞ కలిసి నటించనున్నారని సమాచారం. అంటే, తండ్రి–కొడుకులు స్క్రీన్‌పై ఒకే ఫ్రేములో కనిపించబోతున్నారు. ఇదే నిజమైతే, అభిమానులకు ఇది డబుల్ ట్రీట్ కానుంది. సైంటిఫిక్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది.
మోక్షజ్ఞ పుట్టినప్పుడే ఆయనను హీరోగా చూడాలనుకున్న బాలకృష్ణ, అప్పటి నుంచే మోక్షజ్ఞను గైడ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ కల, ఆ కోరిక నెరవేరబోతోంది. బాలకృష్ణ – మోక్షజ్ఞ కలయికలో వచ్చే “ఆదిత్య 999” మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ బర్త్‌డే సందర్భంగా రానున్న అప్డేట్ కోసం సినీ ప్రేమికులు, అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. “ఆదిత్య 999” అనే ఈ ప్రాజెక్ట్ ద్వారా నందమూరి వారసత్వం మరో తరం ముందుకు సాగనుంది.






