నందమూరి బాలకృష్ణ(Balakrishna), దర్శకుడు క్రిష్(krish) కాంబినేషన్‌లో ఇప్పటివరకు మూడు సినిమాలు విడుదలయ్యాయి. వీరిలో 2017లో వచ్చిన చారిత్రక చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. అనంతరం బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ‘యన్టీఆర్ – కథానాయకుడు’, ‘మహానాయకుడు’ చిత్రాల్లో నటించి, నిర్మించారు. ఈ రెండు చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి.
ఇప్పుడు మళ్లీ బాలయ్య, క్రిష్ కాంబోలో మరో భారీ ప్రాజెక్ట్(grand project) రానున్నట్టు ఫిలింనగర్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా 1991లో విడుదలై సైన్స్ ఫిక్షన్ కేటగిరీలో కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ‘ఆదిత్య 369’కి(Adhityaq369) సీక్వెల్‌గా రూపొందనుందట. ఈ సారి ప్రాజెక్ట్ పేరు ‘ఆదిత్య 999’(Adhitya999)గా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఈ కథను సింగీతం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చేయగా, దాన్ని క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
ప్రస్తుతం బాలకృష్ణ ‘అఖండ 2’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ కమర్షియల్ సినిమాను ప్రారంభించనున్నారు. ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉండగానే, ‘ఆదిత్య 999’ను కూడా సమాంతరంగా రూపొందించే యత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
ఈ సినిమా కూడా మునుపటిలా పీరియడ్ డ్రామా, సైన్స్ ఫిక్షన్ మిక్స్‌గా ఉంటుందా? లేక మైథలాజికల్ టచ్‌తో సోషియో ఫాంటసీగా మలచాలనుకుంటున్నారా? అనే విషయంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం క్రిష్ తన చిత్రం ‘ఘాటీ’ విడుదల పనుల్లో ఉండగా, ఆ తర్వాతే బాలయ్య సినిమా ప్రకటన వెలువడే అవకాశం ఉంది.






