
యూనివర్సల్ హీరో కమల్ హాసన్(Kamal Haasan)కు బెంగళూరు సివిల్ కోర్టు(Bangalore Civil Court)లో ఎదురుదెబ్బ తగిలింది. కన్నడ భాష(Kannada language) లేదా సంస్కృతి గౌరవానికి భంగం కలిగించేలా ఇకపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని ఆయన్ను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గత నెలలో తన ‘థగ్ లైఫ్(Thug Life)’ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా కమల్ హాసన్ మాట్లాడుతూ “కన్నడ భాష తమిళం(Tamil) నుంచే పుట్టింది” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర దుమారాన్ని రేపాయి. పలు కన్నడ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కమల్ క్షమాపణ చెప్పడానికి నిరాకరించడంతో వివాదం మరింత ముదిరి, కర్ణాటకలో ‘థగ్ లైఫ్’ సినిమా విడుదల కూడా నిలిచిపోయింది.
ఆగస్టు 30న వ్యక్తిగతంగా విచారణకు రావాలని ఆదేశం
ఈ నేపథ్యంలో కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు మహేశ్ వూరాలా కమల్ వ్యాఖ్యలపై బెంగళూరు కోర్టులో పిటిషన్(Petition) దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన అడిషనల్ సిటీ సివిల్ అండ్ సెషన్స్ జడ్జి SR మధు కన్నడ భాష, సాహిత్యం, భూమి, సంస్కృతికి వ్యతిరేకంగా ఎలాంటి ప్రకటనలు చేయకుండా కమల్‌పై ఆంక్షలు(Restrictions on Kamal) విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అంతేగాక ఆగస్టు 30న జరగనున్న తదుపరి విచారణకు కమల్‌ను వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశిస్తూ సమన్లు కూడా జారీ చేశారు.
🚨 🚨 #BreakingNews Bengaluru Court Restrains Kamal Haasan From Making Remarks Against Kannada https://t.co/z9Tde8s4fl
A court here on Friday passed an ex-parte interim injunction order restraining actor Kamal Haasan from making any remarks against Kannada language.#Trendin…
— Instant News ™ (@InstaBharat) July 5, 2025
విడుదలైన నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి
కాగా, కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు మణిరత్నం(Maniratnam) కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ చిత్రం “థగ్ లైఫ్”. త్రిష(Trisha) కథానాయికగా, నటుడు శింబు(Simbu) కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంకి థియేటర్లలో మాత్రం ఆశించిన స్పందన రాకపోవడంతో మొదటి రోజు నుంచే ప్లాప్ టాక్‌ను ఎదుర్కొంది. దీంతో ఈ సినిమా డిజిటల్ రైట్స్(Digital Rights)ని రిలీజ్‌కి ముందే భారీ ధరకి NETFLIX కొనుగోలు చేసింది. సినిమాని థియేటర్స్‌లో విడుదలైన 8 వారాలకి స్ట్రీమింగ్ చేసేలా డీల్ మాట్లాడుకున్నారు. కాని ఇప్పుడు చిత్రానికి నెగటివ్ టాక్ రావడంతో నాలుగువారాలలోనే తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ ఇలా అన్ని భాషలలో స్ట్రీమింగ్ అవుతోంది.