ఆసియా కప్‌లో (Asia Cup) టీమిండియా ఇకపై ఆడబోదంటూ బీసీసీఐ (BCCI)తేల్చి చెప్పింది. భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) నిర్వహించే ఈవెంట్ల నుంచి తప్పుకోనున్నట్లు బీసీసీఐ అధికారులు చెబుతున్నారు. వచ్చే నెలలో జరిగే ఉమెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ నుంచి తప్పుకుంటున్నట్లు బీసీసీఐ ఇదివరకే వెల్లడించింది.
పాకిస్తాన్‌తో ఎలాంటి క్రికెట్ మ్యాచ్‌లు ఆడేది లేదు
భారత్–పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొనడంతో ఆ ప్రభావం క్రికెట్‌పైనా పడింది. భవిష్యత్‌లో పాకిస్తాన్‌తో ఎలాంటి క్రికెట్ మ్యాచ్‌లు ఆడేది లేదని బీసీసీఐ తేల్చిచెప్పేసింది. ఈ నేపథ్యంలో శ్రీలంక వేదికగా జూన్‌లో జరిగే మహిళల ఆసియా కప్‌తో పాటు సెప్టెంబర్‌లో జరిగే పురుషుల ఆసియా కప్ నుంచి టీమిండియా(Team India) తప్పుకుంటున్నట్లు బీసీసీఐ ఇప్పటికే ఏసీసీకి సమాచారం అందించింది. ఇకపై ఆసియా కప్‌లో తమ జట్టు పాల్గొనదంటూ వెల్లడించింది.
🚨 BREAKING: India pulls out of Asia Cup 2025 🏏
BCCI officially declines participation.
🇮🇳 No cricket with Pakistan. No compromise.Nation first. Always.#AsiaCup2025 #NoMatchWithTerror#BCCI #CharchaExpress #IndiaStandsTall pic.twitter.com/UjYtrFHG5J
— Charcha Express (@CharchaExpress) May 19, 2025
ప్రజల భావోద్వేగాలను దృష్టిలో పెట్టుకొని
‘పాకిస్తాన్ మినిస్టర్ చీఫ్‌గా ఉన్న ఆసియన్ క్రికెట్ కౌన్సెల్‌లో ఇకపై ఇండియన్ టీమ్ ఎలాంటి టోర్నమెంట్లు ఆడదు. దేశంలోని ప్రజల భావోద్వేగాలను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం. ఇదే విషయమై ఏసీసీతో కూడా మాట్లాడాం. వచ్చే నెలలో జరిగే ఉమెన్స్ ఆసియా కప్ నుంచి భారత్ విత్‌డ్రా చేసుకున్నట్లు తెలిపాము. భవిష్యత్‌లో జరిగే మిగతా టోర్నమెంట్లు కూడా మేము ఆడటం లేదని చెప్పాం. మేము భారత ప్రభుత్వంతో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటున్నాము’ అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు వెల్లడించారు.






