Mana Enadu: దీపావళి(Diwali) సందర్భంగా అయోధ్యలో సరయూ నది(Sarayu River in Ayodhya) తీరాన దీపోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. లక్షలాది దీపాల కాంతులతో ఆ ప్రాంతం వెలిగిపోయింది. రామమందిరం(Ram Temple) ప్రారంభమైన తర్వాత జరుగుతున్న మొదటి వేడుకలు ఇవే కావడం విశేషం. ఈ దీపోత్సవ కార్యక్రమం రెండు గిన్నీస్ రికార్డులు(Two Guinness records) సొంతం చేసుకుంది. సరయూ నది తీరంలో అత్యధికంగా సంఖ్యలో పాల్గొన్న భక్తులు ఏకకాలంలో దీపాలతో హారతిని ప్రదర్శించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు.
25,12,585 దీపాలను వెలిగించారు..
అలాగే UP ప్రభుత్వం, టూరిజం డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో 25,12,585 దీపాలను భక్తులు(Devotees) వెలిగించి రికార్డు నెలకొల్పారు. అతిపెద్ద నూనె దీపాల ప్రదర్శనకు గాను అయోధ్య దీపోత్సవానికి మరో గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా దక్కింది. మొత్తంగా 55 ఘాట్‌లలో ఏర్పాటు చేసిన దీపాలను ప్రత్యేక డ్రోన్ల(special drones)తో గిన్నీస్ ప్రతినిధులు లెక్కించారు. గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్‌కు సంబంధించి రెండు సర్టిఫికేట్లను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్(Uttar Pradesh Chief Minister Yogi Adityanath) అందుకున్నారు.
ఆకట్టుకున్న లేజర్, డ్రోన్ షో
మొత్తం 25 లక్షల దీపాల(lamps)ను వెలిగించాలని లక్ష్యంగా పెట్టుకున్న నిర్వాహకులు ముందుగానే 28 లక్షల దీపాలను ఆర్డర్ చేశారు. రామమందిరంతో పాటుగా ఇతర పరిసర ప్రాంతాలను ప్రమిదలతో అలంకరించారు. దాదాపు 30 వేల మంది వాలంటీర్లు ఈ దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓ ఘాట్ వద్ద ఏకంగా 80 వేల దీపాలతో స్వస్తిక్ ఆకారం(Swastik shape)లో ప్రమిదలను వెలిగించడం అందరినీ ఆకట్టుకుంది. లేజర్, డ్రోన్ షో(Laser and drone show)లు ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
After a wait of over 500 years, we are celebrating Deepotsav at Shri Ram Janambhoomi Mandir in Ayodhya. The struggle for cultural resurgence continues, with many more temples yet to be reclaimed.
Jai Shri Ram! pic.twitter.com/UKUgYoA3ne
— Danish Kaneria (@DanishKaneria61) October 30, 2024






