
తెలుగు సినీ ప్రియులకు శుభవార్త. బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas), మంచు మనోజ్(Manchu Manoj), నారా రోహిత్(Nara Rohith) ప్రధాన పాత్రల్లో నటించిన హై-ఓక్టేన్ యాక్షన్ డ్రామా ‘భైరవం(Bhairavam)’ ఓటీటీలోకి రాబోతోంది. ఈ చిత్రం జులై 18 నుంచి ZEE5 ప్లాట్ఫామ్లో తెలుగు, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. మే 30, 2025న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందనతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
విశ్వాసం, త్యాగాల నేపథ్యంలో..
విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన ‘భైరవం’ తమిళ హిట్ చిత్రం ‘గరుడన్(Garudan)’ రీమేక్. ఈ స్టోరీ తూర్పు గోదావరి జిల్లాలోని దేవీపురం గ్రామంలోని వారాహి ఆలయ భూముల చుట్టూ తిరుగుతుంది. గజపతి (Manchu Manoj), వరద (Nara Rohith), శ్రీను (Bellamkonda Sai Srinivas) అనే ముగ్గురు స్నేహితుల బంధం, విశ్వాసం, త్యాగాల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఒక అవినీతి మంత్రి ఆలయ భూముల(Temple Lands)ను కైవసం చేసుకోవాలని పథకం వేయడంతో ఈ ముగ్గురి స్నేహం పరీక్షకు గురవుతుంది. అదితి శంకర్, ఆనంది, దివ్యా పిళ్లై, జయసుధ(Jayasudha) తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
#Bhairavam #BellamkondaSaiSreenivas #ManchuManoj #NaraRohit #AditiShankar #KayalAnandi #DivyaPillai #Zee5 #OTT pic.twitter.com/UbktQ7p6g1
— CinemasJunction (@CinemasJunction) July 8, 2025
శ్రీచరణ్ పకాల సంగీతం, హరి కె. వేదంతం సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి బలం. ZEE5 ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కులను ₹32 కోట్లకు సొంతం చేసుకుంది. థియేటర్లలో యాక్షన్ సీన్స్, ఎమోషనల్ డ్రామాతో ఆకట్టుకున్న ‘భైరవం’ ఇప్పుడు ఓటీటీలో కూడా అదే ఉత్సాహాన్ని అందించనుంది. సినిమా ప్రియులు ఈ థ్రిల్లింగ్ డ్రామాను ZEE5లో జులై 18 నుంచి ఆస్వాదించవచ్చు.