బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో చివరిదైన 5వ టెస్టు ప్రారంభమైంది. ఆస్ట్రేలియాతో సిడ్నీ(Sydney) వేదికగా మొదలైన ఈ టెస్టులో భారత్ టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ టెస్టుకు రోహిత్(Rohit Sharma)కు రెస్ట్ ఇచ్చారు. కెప్టెన్‌గా బుమ్రా(Bumbrah) బాధ్యతలు తీసుకున్నారు. మరోబౌలర్ ఆకాశ్ దీప్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణకు అవకాశం ఇచ్చారు. హిట్ మ్యాన్ స్థానంలో శుభ్ మన్ గిల్ ఎంట్రీ ఇచ్చాడు. దీంతో భారత ఇన్నింగ్స్‌ను జైస్వాల్-రాహుల్ ఓపెన్ చేశారు.
ఆదిలోనే షాక్
మరోవైపు టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. 17 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. జైస్వాల్ (10), రాహుల్ (4) స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు. గిల్, కోహ్లీ కుదురుకున్నట్లే కనబడినా లంచ్‌కి ముందు చివరి బంతికి గిల్ (20) అనవసర షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. ప్రస్తుతం 12 పరుగులతో విరాట్ కోహ్లీ(Virat Kohli) క్రీజులో ఉన్నాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్ట్క్, లయన్ చేరో వికెట్ పడగొట్టారు.
ఆసీస్ జట్టులో వెబ్‌స్టర్ డెబ్యూ
టాస్ కోసం వచ్చిన టీమిండియా తాత్కాలిక కెప్టెన్ జస్ప్రిత్ బుమ్రా(Jasprit Bumrah) ఐదో టెస్టులో మార్పులపై స్పందించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ చివరి టెస్టు నుంచి రెస్ట్ తీసుకుంటానని చెప్పాడు. జట్టు ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకుని లీడర్ షిప్ క్వాలిటీ చూపించాడు. ఆస్ట్రేలియా జట్టులో ఓ మార్పు చోటుచేసుకుంది. మిచెల్ మార్ష్ స్థానంలో కొత్త ఆల్ రౌండర్ వచ్చాడు. బ్యూ వెబ్‌స్టర్(Beau Webster) టెస్టు అరంగేట్రం చేశాడు. వెటరన్ బ్యాటర్ మార్క్ వా(Mark Wa) నుంచి బ్యాగీ గ్రీన్ క్యాప్ అందుకున్నాడు వెబ్‌స్టర్. కాగా ఈ టెస్టులో భారత్ నెగ్గితేనే డబ్ల్యూటీసీ(World Test Championship Final) ఫైనల్ అవకాశాలు ఉంటాయి.
This is Prince Shubman Gill, this is stupidity at highest level.
You are at last ball of the Session, and then throw the Wicket to Nathan Lyon of all bowlers. Pathetic and Horrible batsmanship by Gill. #INDvsAUS pic.twitter.com/8gQPZ4NFIM— 🇮🇳Kushagra (@BabaKushagra) January 3, 2025








