Mana Enadu: తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case )లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఇంటర్ పోల్ రంగంలోకి దిగింది. ప్రధాన నిందితులైన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(Special Intelligence Branch) మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, ఓ మీడియా సంస్థ మాజీ ఎండీ శ్రవణ్ రావుపై రెడ్‌కార్నర్ నోటీసుల(Red corner notices) జారీ ప్రక్రియ వేగవంతమైంది. త్వరలోనే వీరికి ఇంటర్ పోల్(Interpol) ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు పోలీసు వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. మరోవైపు ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించే పనిలో ఇంటర్‌పోల్ నిమగ్నమైంది.
అందుకే ముందస్తు బెయిల్ పిటిషన్
ఈ కేసుకు సంబంధించి CBI సిఫార్సుతో అందిన కేస్ డాక్యుమెంట్ల ఆధారంగా ఇంటర్ పోల్ అధికారులు దర్యప్తు చేస్తున్నట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) జరిగినట్లు నిరూపించే సాంకేతిక ఆధారాల(Technical evidences)తో పాటు మరికొన్ని అనుమానాలను నివృత్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. బ్యూరోక్రాట్స్, ప్రభుత్వ, ప్రైవేట్ వ్యక్తుల వ్యక్తిగత జీవితాలపై ఫోన్ ట్యాపింగ్ ఎంత ప్రభావం చూపిందో ఇన్వెస్టిగేషన్ అధికారులు(Investigating Officers) ఇంటర్‌పోల్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమెరికా పరారైన ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు(Prabhakar Rao and Shravan Rao) రోజు అక్కడ కలుసుకుంటున్నారని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఇంటర్‌పోల్ అరెస్ట్ చేయడానికి ముందే శ్రవణ్ రావు ఇండియాకు వచ్చి ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం హైకోర్టు(High Court)ను ఆశ్రయించినట్లు తెలుస్తోంది.






