Pawan Kaiyan: భారీ ధరకు హరిహర వీరమల్లు ఓటీటీ డీల్!

పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kaiyan) ప్రధాన పాత్రలో రూపొందిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు’(Hari Hara Veera Mallu) ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ఎన్నో వాయిదాల తర్వాత ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం జూలై 24న గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. రిలీజ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో, చిత్ర బృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచింది.

ఈ నేపథ్యంలో, జూలై 20న గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్(Pre Release Event) నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు ఎస్.ఎస్. రాజమౌళి(SS. Rajamouli), త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram srinivas) ముఖ్య అతిథులుగా హాజరవనున్నారనే టాక్ వినిపిస్తోంది.

Also Read: సీనియర్ నటుడు సుమన్‌ రీ ఎంట్రీ.. స్టార్ మా స్క్రీన్‌పై కీలక పాత్రలో..

సుమారు రూ.250 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై విడుదలకు ముందే అంచనాలు మిన్నంటాయి. ముఖ్యంగా యుఎస్‌లో (USA) ప్రీమియర్ షోలకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ విపరీతంగా జరుగుతున్నాయి. దాంతో, సినిమా విడుదలకు వారం రోజుల ముందు నుంచే రికార్డుల వేట మొదలైంది.

బిజినెస్ పరంగా కూడా ఈ మూవీ సంచలనాలు సృష్టిస్తోంది. థియేట్రికల్ రైట్స్ సుమారు 150 కోట్ల వరకు డీల్స్ జరిగాయని సమాచారం. అదనంగా, ఓటీటీ (OTT) హక్కులను ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో(Amezon Prime video) కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం విలువ రూ.60 కోట్లు దాటినట్టు టాక్.

ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఓ యోధుడి పాత్రలో కనిపించనున్నాడు. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ మొఘల్ చక్రవర్తిగా నటించగా, నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్‌గా సందడి చేయనుంది. సత్యరాజ్, జిషు సేన్‌గుప్తా, నోరా ఫతేహి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని క్రిష్ కొంతవరకు డైరెక్ట్ చేయగా, మిగితా భాగాన్ని జ్యోతి కృష్ణ పూర్తి చేశారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏ.ఎం. రత్నం సమర్పణలో ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *