Mana Enadu : బిగ్బాస్ సీజన్-8 తెలుగు (Bigg Boss Telugu Season 8) షో ఇటీవలే ముగిసిన విషయం తెలిసిందే. ఈ సీజన్ విన్నర్ గా నిఖిల్ టైటిల్ దక్కించుకున్నాడు. ఇక ఈ సీజన్ లోని కంటెస్టెంట్లందరిలో తన మార్క్ చూపించింది సోనియా ఆకుల (Sonia Akula). హౌజులో ఉంది నాలుగైదు వారాలే అయినా సోనియా తన ఆటతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఈ భామ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. తన లవర్ యశ్ ను శుక్రవారం రోజున పెళ్లాడింది. ఈ వివాహ వేడుకకు సంబంధించి ప్రస్తుతం ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
పెద్దోడు చిన్నోడు అంటూ షాక్
బిగ్ బాస్ హౌజులో సోనియా నిఖిల్ (Nikhil), పృథ్వీలతో బాగా కనెక్ట్ అయింది. ఒక దశలో ఈ బ్యూటీ ఏం చెబితే అదే కరెక్టు అన్నట్లుగా ఆ ఇద్దరూ తమ ఆటను ఆడారు. ఇద్దరితో క్లోజ్ గా ఉంటూ వాళ్ల గేమ్ ను కంట్రోల్ చేస్తుంది అనే విమర్శలు కూడా వెల్లువెత్తాయి. వాళ్లతో ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిపిస్తోందని ఆడియెన్స్ అనుకుంటుండగా.. పెద్దోడు.. చిన్నోడు అంటూ మాట మార్చేసి యశ్ తో ఉన్న లవ్ స్టోరీ గురించి చెప్పి బయటకు వెళ్లాక పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పి షాక్ ఇచ్చింది.
అందుకే నెగిటివిటీ
అయితే యశ్ తో ప్రేమలో ఉన్న సోనియా హౌజు(Bigg Boss Sonia Akula)లో మొదటి మూడు వారాలు పృథ్వీ, నిఖిల్ లతో క్లోజ్ గా ఉండటం ఆడియెన్స్ కు పెద్దగా నచ్చలేదు. దీంతో ఆమెపై నెగిటివిటీ పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ఆమె నాలుగో వారంలో షో నుంచి ఎలిమినేట్ అయింది. ప్రేక్షకులు ఊహించినట్టుగానే ఆమె హౌజు నుంచి బయటకు వెళ్లిన తర్వాతే పృథ్వీ, నిఖిల్ తమ గేమ్ పై ఫోకస్ పెట్టారు.
సోనియా పెళ్లిలో వాళ్లు మిస్
ఇక హౌసు నుంచి బయటకు వచ్చిన సోనియా తన ప్రియుడు యశ్ (Sonia Akula Wedding) తో నిశ్చితార్థం చేసుకుంది. ఇక శుక్రవారం రోజున ఈ జంట పెళ్లి కూడా జరిగింది. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సోనియా పెళ్లికి సీజన్-8 కంటెస్టెంట్లు అయిన టేస్టీ తేజ, రోహిణి అటెండ్ అయ్యారు. వారితో పాటు అమర్ దీప్, తేజస్విని కూడా వచ్చారు. కానీ పెద్దోడు చిన్నోడు అదేనండి నిఖిల్, పృథ్వీలు మాత్రం రాలేదు. ప్రస్తుతం ఇదే విషయం చర్చనీయాంశం అవుతోంది.






