తెలుగు ప్రేక్షకుల్లో బిగ్ బాస్ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిందీతో పాటు వివిధ భాషల్లో విజయవంతంగా ప్రసారమవుతున్న ఈ రియాలిటీ గేమ్ షో.. తెలుగులోనూ ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం 9వ సీజన్ కోసం రంగం సిద్ధమవుతోంది. మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు బిగ్ బాస్ టీం సిద్ధమవుతోంది.
ప్రతి సీజన్లోనూ సామాన్యులతో పాటు సెలబ్రిటీలకు, సోషల్ మీడియా స్టార్లకు బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించే అవకాశం లభిస్తూ వచ్చింది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పలువురు ఇన్ఫ్లుయెన్సర్లు గత సీజన్లలో బిగ్ బాస్ హౌస్‌లో కనిపించారు. వారి అటెండెన్స్‌తో షోకు మరింత హైప్ వచ్చేది కూడా నిజమే.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈసారి మాత్రం బిగ్ బాస్ టీం తమ దృష్టిని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కాకుండా టెలివిజన్ రంగంలోని ప్రముఖులపైనే నిలిపినట్టు టాక్ వినిపిస్తోంది. ఈ నిర్ణయానికి ప్రభావితమైన కారణాలు బాలీవుడ్ బిగ్ బాస్ నుంచి వచ్చిన తాజా అప్డేట్తో సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది.
హిందీలో ఇప్పటికే 18 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. త్వరలో 19వ సీజన్‌కు సిద్ధమవుతోంది. ఈసారి మాత్రం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు ఎంట్రీ ఇవ్వకూడదని నిర్వాహకులు స్పష్టంగా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కేవలం టెలివిజన్ రంగానికి చెందిన నటీనటులకే అవకాశమివ్వాలని, ప్రేక్షకులకు ఆ తరహా కంటెంట్‌నే అందించాలనేది వారి ఉద్దేశం. ఈ విషయంపై హోస్ట్ సల్మాన్ ఖాన్ కూడా సమ్మతించారట.
ఇలాంటి నిర్ణయాన్ని తెలుగు బిగ్ బాస్ నిర్వాహకులు కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియా స్టార్ల సంఖ్య పెరగడంతో చాలామందికి ఈ షో ద్వారా పాపులారిటీ రాబట్టాలన్న ఉద్దేశ్యమే ఉన్నట్టు నిర్వాహకులు భావిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే తాజా మార్పులపై ఆలోచన జరుపుతున్నట్టు సమాచారం.
తెలుగు బిగ్ బాస్ 9లో నిజంగా ఈ మార్పులు అమలవుతాయా? లేక ఇంతకుముందిలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల సందడి కొనసాగుతుందా? అన్నది మరికొద్ది రోజుల్లో స్పష్టమవుతుంది.






