బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే రియాలిటీ షో బిగ్‌బాస్(Bigg Boss) మరోసారి కొత్త సీజన్‌తో రాబోతున్నది. ఇప్పటికే తెలుగు బిగ్‌బాస్(Bigg Boss) ప్రోమో విడుదల కాగా, తాజాగా హిందీ బిగ్‌బాస్ సీజన్ 19కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది.
ఈసారి హిందీ వర్షన్‌కి సంబంధించి విడుదల చేసిన ప్రోమోలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) రాజకీయ నాయకుడిగా కనిపించి అందరిని ఆశ్చర్యపరిచాడు. “ఈసారి హౌస్‌మేట్స్‌నే ప్రభుత్వం” అనే క్యాప్షన్‌తో ఆయన స్వయంగా ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
ఆగస్ట్ 24 నుంచి హిందీ బిగ్‌బాస్ సీజన్ ప్రారంభం కానుంది. జియో హాట్‌స్టార్, కలర్స్ టీవీలో గ్రాండ్ ప్రీమియర్ ప్రసారం కానుంది. ఆగస్ట్ 24 నుంచి హిందీ బిగ్‌బాస్ సీజన్ ప్రారంభం కానుంది. గత సీజన్ లో మూడున్నర నెలలు మాత్రమే నడవగా, ఈసారి షో ఐదున్నర నెలల పాటు కొనసాగనున్నట్లు సమాచారం.
తెలుగు బిగ్‌బాస్ సీజన్ విషయంలో కూడా ఆసక్తికర అప్డేట్స్ వినిపిస్తున్నాయి. ఈసారి కామన్ పీపుల్‌కి అవకాశం ఇవ్వబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. గత సీజన్లలో సెలబ్రిటీలు మాత్రమే పాల్గొనగా, సాధారణ ప్రజలకు కూడా ఈసారి ఎంట్రీ దక్కితే, ఆట మరింత ఉత్సాహంగా మారే అవకాశం ఉంది.
View this post on Instagram






