Mana Enadu : అన్ లిమిటెడ్ ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ అంటూ బిగ్‌బాస్ సీజన్-8 (bigg boss 8 telugu) మొదలైన విషయం తెలిసిందే. ఈ సీజన్ లో హౌసులోకి మొత్తం 14 మంది కంటెస్టెంట్‌లు వెళ్లగా, ఇప్పటి వరకు ఆరుగురు ఎలిమినేట్ అయి హౌస్ నుంచి బయటకు వెళ్లారు. ప్రేక్షకుల నుంచి తక్కువ ఓట్లు రావడంతో మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో ఆదిత్య ఓం ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.
నైనిక ఎలిమినేషన్
ఇక వీకెండ్‌లో నైనిక హౌస్ నుంచి బయటకు వెళ్లింది. ఫన్‌లు, టర్న్‌లు, ట్విస్ట్‌లకు లిమిటే లేదన్న థీమ్‌తో మొదలైన ఈ సీజన్ అందుకు తగినట్లుగానే ఉంటోంది. తాజాగా ఈ సండే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు (Wild Card Entry In Bigg Boss 8 Telugu Contestants) తుపానులా హౌసులోకి దూసుకువచ్చాయి. మరి ఇంతకీ ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎవరంటే..
హరితేజ, టేస్టీ తేజ
సీజన్-1లో తన ఆటతో పాటు అన్ లిమిటెడ్ ఎంటర్టైన్ మెంట్ ఇచ్చిన హరితేజ వైల్డ్ కార్డ్ ఎంట్రీలా ఈసారి హౌసులోకి దూసుకొచ్చింది. ‘హరితేజ’ అనే నేను బిగ్‌బాస్ పిలుపును బాగా మిస్సయ్యానని.. అందుకే మళ్లీ వచ్చానని చెప్పుకొచ్చింది. ఇక ఆ తర్వాత వచ్చిన సీజన్-7 కంటెస్టెంట్ టేస్టీ తేజ మాట్లాడుతూ.. ఈ షోకు రాకముందు రెస్టరెంట్స్‌కు వెళ్లి ఫుడ్ వీడియోలు చేసుకునే వాడినని.. ఈ 8 నెలల్లో 15 రెస్టరెంట్స్‌ను ప్రారంభించానని తెలిపాడు. ‘టి ఫ్రాంఛైజీ’ పేరుతో సొంతంగా వ్యాపారం కూడా ప్రారంభించానని.. దాదాపు 20 బ్రాంచ్‌లు కూడా పెట్టానని చెప్పాడు.
నయని పావని, మెహబూబ్
బిగ్‌బాస్ సీజన్-7 కంటెస్టెంట్ అయిన నయని పావని (Nayani Pavani) వైల్డ్ కార్డ్ ద్వారా సీజన్-8లోకి (Wild Card Entry In Bigg Boss 8) అడుగు పెట్టింది. గత సీజన్‌లో నేను బయటకు వెళ్లినప్పుడు ప్రేక్షకులు నేను ఎంత ఫీలయ్యానో అంతకన్నా ఎక్కువగా ప్రేక్షకులు ఫీలయ్యారని.. బహుశా వాళ్లు మళ్లీ కోరుకున్నారేమో అందుకే మళ్లీ వచ్చానని తెలిపింది. బిగ్‌బాస్ సీజన్-4 కంటెస్టెంట్ అయిన మెహబూబ్ (Mehaboob dil se) మళ్లీ బిగ్‌బాస్ ఛాన్స్ రావడం నిజంగా ఆనందంగా ఉందని.. ఇండిపెండెంట్ పాటలను డెవలప్ చేయడం తన కల అని చెప్పాడు.
రోహిణి, గౌతమ్ కృష్ణ
బిగ్‌బాస్ సీజన్-3 కంటెస్టెంట్ అయిన రోహిణి (Rohini) సీజన్-3 నుంచి వెళ్లిన తర్వాత తన జర్నీ పూర్తవలేదనిపించిందని.. ఆ మూడుకి మరోవైపు ఫినిష్ చేస్తే ఎనిమిది అవుతుందని.. అందుకే వచ్చేనేమోనని చెప్పుకొచ్చింది. బిగ్‌బాస్ సీజన్-7 కంటెస్టెంట్ అయిన గౌతమ్ కృష్ణ (Gautham Krishna) ఇప్పుడు సోలో బాయ్‌గా వచ్చానని.. ఇది తన రాబోయే చిత్రమని తెలిపాడు. 13వ వారం వరకూ వెళ్లి, వెనక్కి రావడం వెలితిగా అనిపించిందని.. ఈ అవకాశం రావడం అదృష్టమని చెప్పాడు.
అవినాష్, గంగవ్వ
బిగ్‌బాస్ సీజన్-4 కంటెస్టెంట్ అవినాష్ (Avinash) సీజన్-4లో వచ్చానని.. మరో నాలుగు కలుపుకొని, 8కు వచ్చానని తెలిపాడు. బిగ్‌బాస్ సీజన్-4 కంటెస్టెంట్ అయిన గంగవ్వ (Gangavva) మరోసారి బిగ్‌బాస్ హౌస్‌లోకి (Wild Card Entry In Bigg Boss 8) అడుగు పెట్టింది. గత సీజన్‌లో ఉండలేకపోతున్నానని చెబితే ఇంటికి పంపారని.. ఈసారి బిగ్ బాస్ వెళ్లగొట్టేవరకూ ఉంటానని చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం సీజన్-8లో ఉన్న హౌస్‌మేట్స్ (యష్మి, విష్ణు ప్రియ, సీత, పృథ్వీ, ప్రేరణ, నిఖిల్, నబీల్, మణికంఠ) ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్స్ (ఓజీ) కాగా, వైల్డ్‌కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన వాళ్లను రాయల్ క్లాన్‌గా నామకరణం చేశారు.






