
అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) సమీపిస్తుండటంతో బిహార్(Bihar) సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా నిరుద్యోగులే టార్గెట్‌గా ప్రచారం చేపట్టారు. ఈ మేరకు యువతను ఆకట్టుకునేందుకు X వేదికగా కీలక ప్రకటన చేశారు. 2025-2030 మధ్య కాలంలో కోటి ఉద్యోగాలు(Jobs) కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. గతంలో ఇచ్చిన 50 లక్షల ఉద్యోగాల కల్పన హామీ దాదాపు పూర్తయిందన్నారు. గత ఐదేళ్లలో 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, మరో 39 లక్షల మందికి ప్రైవేటు రంగం(Private sector)లో ఉపాధి కల్పించినట్లు నీతీశ్ చెప్పారు.
రెండు రంగాల్లో కొత్త ఉద్యోగాలను సృష్టిస్తాం
కాగా గతంతో పోల్చుకుంటే ఈసారి రెట్టింపు ఉద్యోగాలు కల్పించబోతున్నామన్నారు. కేవలం ప్రభుత్వ సెక్టార్(Govt Sector)లోనే కాకుండా ప్రైవేటు, ఇతర పారిశ్రామిక రంగాల్లో ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. దీనికోసం ఉన్నత స్థాయి కమిటీ(High Level Committee)ని కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు నీతీశ్ పేర్కొన్నారు. ‘‘ ప్రస్తుత ప్రభుత్వ హయాంలో 10 లక్షల మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం. ప్రైవేటు రంగంలో మరో 39 లక్షల మందికి ఉపాధి కల్పించాం. గతంలో ఇచ్చిన 50 లక్షల ఉద్యోగాల హామీ దాదాపు నెరవేరినట్లే. ఇప్పుడు లక్ష్యాన్ని రెట్టింపు చేస్తున్నాం. వచ్చే ఐదేళ్లలో కోటి ఉద్యోగాలిస్తాం. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కొత్త ఉద్యోగాలను సృష్టిస్తాం’’ అని నీతీశ్ కుమార్ పేర్కొన్నారు. కాగా బిహార్‌లో ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశముంది.
बिहार के सीएम नीतीश कुमार का बड़ा ऐलान..अगले 5 साल में 1 करोड़ सरकारी नौकरी देने का दावा…2025-2030 के बीच 1 करोड़ सरकारी नौकरी देंगे#BiharNews #Nitishkumar #Election2025 pic.twitter.com/oYFwDyJaMH
— India TV (@indiatvnews) July 13, 2025