దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల(Delhi Elections 2025)కు సంబంధించిన ఫలితాలు వస్తున్నాయి. 699 మంది అభ్యర్థులు.. 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బరిలో నిలిచారు. దేశ రాజధాని కావడం, కేంద్రం కూడా అక్కడి నుంచే పాలన సాగిస్తుండటం కావడంతో అన్ని పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. దీంతో AAP, BJP, CONGRESS ఎవరికి వారు తమదే విజయం అని ధీమాతో ఉన్నాయి. కానీ తాజాగా ఓట్ల లెక్కింపు(Votes Counting)లో మాత్రం ఎలాంటి ఉత్కంఠ లేదు. ఎలాంటి ఉక్కిరి బిక్కిరీ లేదు. ఢిల్లీ ఓటర్లు(Delhi Voters) స్పష్టతతో ఉన్నారు. స్పష్టమైన విధానంలోనే తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలుస్తోంది.
45 స్థానాలకు మించి ఆధిక్యంలో బీజేపీ
ఇవాళ తొలుత శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన బ్యాలెట్ ఓట్ల లెక్కింపు(Counting of Ballot Votes) ప్రక్రియలో ఆది ఓటు నుంచే బీజేపీ పట్టుసాధించింది. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, సర్వీసు ఉద్యోగులు ఇలా అన్ని విభాగాలకు చెందిన ఉద్యోగులు 70 శాతం మంది BJPకి అనుకూలంగానే ఓటెత్తినట్లు ట్రెండ్స్ తెలుపుతున్నాయి. ఢిల్లీలో అధికారం చేపట్టేందుకు 36 స్థానాలు కావాల్సి ఉండగా.. తాజాగా వస్తున్న ట్రెండ్లలో బీజేపీ 46 స్థానాలకు మించి ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఇక, గత ఎన్నికల్లో 69 స్థానాలు కైవసం చేసుకున్న AAP.. కేవలం 23-24 స్థానాలకే పరిమితమైనట్లు తెలుస్తోంది. ఇటు కాంగ్రెస్‌కు జీరో(0)తో హ్యాట్రిక్ కొట్టడం ఖాయం.
ఈ అంశాలే బీజేపీకి కలిసొచ్చాయా?
ముఖ్యంగా మాస్ ఏరియాల్లో BJP పుంజుకుంది. ఇది కచ్చితంగా ఆప్ ఓటు బ్యాంకును ప్రభావితం చేసింది. అంటే.. ఆప్ ఓట్లు గుండుగుత్తగా.. బీజేపీవైపు మళ్లాయి. అదేసమయంలో మద్య తరగతి ఉన్న చోట కూడా BJPపీకి ఆశించిన విధంగానే ఓట్లు రాలుతున్నాయి. ఇటీవల బడ్జెట్లో రూ.12లక్షల వరకు ట్యాక్స్ ఫ్రీ, అరవింద్ కేజ్రీవాల్(AK), ఆ పార్టీ నేతలపై అవినీతి ఆరోపణులు(Allegations of corruption) ఆప్‌కి వ్యతిరేకంగా మారినట్లు తెలుస్తోంది. మొత్తానికి దాదాపు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠంపై కాషాయం జెండా రెపరెపలాడనుంది. ఇప్పటికే ఢిల్లీలో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.
दिल्ली: #DelhiElectionResults में भाजपा की बढ़त पर भाजपा कार्यकर्ताओं ने पार्टी कार्यालय पर आतिशबाजी, ढोल और नगाड़ों के साथ जश्न मनाया। pic.twitter.com/YKCEX260I5
— IANS Hindi (@IANSKhabar) February 8, 2025






