బ్లాక్‌బస్టర్ హిట్ సొంతం చేసుకున్న మలయాళ మూవీ ‘నరివెట్ట’ (Narivetta) ఇప్పుడు తెలుగులోనూ విడుదల కానుంది. ప్రత్యేక చిత్రాలతో తనకంటూ ఫ్యాన్ బేస్‌ను పెంచుకున్న టొవినో థామస్ (Tovino Thomas) ప్రధాన పాత్రలో నటించగా.. అనురాజ్ మనోహర్ ఈ మూవీని తెరకెక్కించారు. ఈ నెల 23న రిలీజ్అయిన ఈ క్రైమ్ థ్రిల్లర్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఈ చిత్రాన్ని తెలుగులో ఈ నెల 30న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం తెలుగు ట్రైలర్(Narivetta Telugu Trailer)ను బుధవారం రిలీజ్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఈ మూవీ ట్రైలర్‌ను చూసేయండి..






