Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’లో బాబీ డియోల్ పాత్ర హైలైట్‌గా నిలుస్తుంది: డైరెక్టర్ జ్యోతి కృష్ణ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు(Hari Hara Veera Mallu)’. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం(AM Ratnam) సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ(MM Jyothi Krishna), క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్(Nidhi Agarwal), బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్, జిషు సేన్‌గుప్తా, నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నరా ఫతేహి తదితరులు నటిస్తున్నారు. కాగా ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో జులై 24 ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. జులై 3న ట్రైలర్‌(Trailer)ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ అల్రెడీ ప్రకటించారు.

పవన్ కళ్యాణ్ మొదటి పాన్ ఇండియా సినిమా

కాగా ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి సంబంధించి డైరెక్టర్ జ్యోతి కృష్ణ(Director Jyothi Krishna) పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు. ఈ మూవీకి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పారు. ఇది పవన్ కళ్యాణ్ మొదటి పాన్ ఇండియా సినిమా కావడం విశేషమని చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ మునుపెన్నడూ కనిపించని విధంగా మొదటిసారి చారిత్రక యోధుడి పాత్రలో కనువిందు చేయనున్నారని తెలిపారు. ఇక ‘యానిమల్(Animal)’ సినిమాలో తనదైన నటనతో ఆకట్టుకున్న బాబీ డియోల్(Baby Deol).. ‘హరి హర వీరమల్లు’లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు(Mughal Emperor Aurangzeb) పాత్ర పోషిస్తుండటం మరో ప్రత్యేకతగా చెప్పవచ్చని అన్నారు.

Bobby Deol's performance in Animal prompted Hari Hari Veera Mallu director to rewrite his character

బాబీ డియోల్ నటన అద్భుతం..

‘‘నిజానికి బాబీ డియోల్(Baby Deol) పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను ప్రారంభంలోనే చిత్రీకరించారు. కానీ, ‘యానిమల్’ చిత్రంలో బాబీ డియోల్ నటన అద్భుతం. పాత్రకు సంభాషణలు లేకపోయినా, హావభావాల ద్వారానే భావోద్వేగాలను వ్యక్తపరిచిన ఆయన అసమాన ప్రతిభ ఆశ్చర్యపరిచింది. అందుకే మా సినిమాలో కూడా ఆయన పాత్ర కోణాన్ని మార్చి, పూర్తిగా సరికొత్త రూపం ఇవ్వాలని నిర్ణయించుకుని మార్చాం. దీంతో ఔరంగజేబు పాత్ర మరింత బలంగా, ఆకర్షణీయంగా మారింది. అది చూసి బాబీ డియోల్ చాలా సంతోషపడ్డారు. ఆయనతో కలిసి పని చేయడం గొప్ప అనుభవం” అని జ్యోతి కృష్ణ పేర్కొన్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *